మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తి.. సంచలన వ్యాఖ్యలు

మంత్రుల పనితీరుపై మరోసారి సీఎం అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) ఎన్. చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) మరోసారి త‌న కేబినెట్‌ మంత్రుల (Cabinet Ministers) పనితీరుపై (Performance) తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ స‌చివాల‌యంలో జ‌రిగిన HODల (Heads of Departments) సమావేశంలో ఆయన మంత్రుల పని తీరు ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. “మంత్రుల పనితీరులో ఇప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు” అని వ్యాఖ్యానించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా చాలా మందికి తెలియని పరిస్థితి నెలకొన్నదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సీఎం చంద్రబాబు ముఖ్యంగా కేంద్ర నిధుల వినియోగం, కేంద్రం నుండి నూతన నిధులు తెచ్చే విషయంలో మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. “ఒక్కరోజు ఢిల్లీ (Delhi)కి వెళ్లడంలో ఏ నష్టం లేదు. కేంద్ర నిధులు తెచ్చుకోవడం కోసం మంత్రులు ముందుకు రావాలి” అని ఆయన సూచించారు. కనీసం ఇప్పుడైనా పని తీరు మార్చుకోవాలని సీఎం గట్టిగా సూచించారు.

ఫైల్స్ క్లియరెన్స్‌పై మంత్రుల‌కు ర్యాంకులు
సమావేశంలో IT శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ (Katamaneni Bhaskar) మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్ (Files Clearance) పై పూర్తి వివరాలతో రిపోర్ట్‌ను ప్రజెంటేషన్ చేశారు. ఇందులో పలువురు మంత్రులు ఫైల్స్ క్లియర్ (Clear Files) చేయడంలో తీవ్రమైన ఆలస్యం చేస్తున్నట్లు బయటపడింది. ఫైల్స్ వ్యవహారంలో వేగం పెంచాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మంత్రులలో పనితీరు ఇలా
ఫైల్స్ క్లియరెన్స్‌లో చంద్రబాబు, నారా లోకేష్, నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యకుమార్, దుర్గేష్ సగటున మూడు రోజుల్లో క్లియర్ చేస్తున్నారు. ఈ ప్ర‌క్రియ‌లో మంత్రి నారా లోకేష్ కంటే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) వెనుక‌బ‌డిపోయారు. ఫైల్స్ క్లియ‌రెన్స్‌కు ప‌వ‌న్‌ సగటున 4 రోజులు తీసుకుంటున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సగటున 11 రోజులు తీసుకుంటున్నారు. కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అత్యధికంగా 15 రోజులు తీసుకుంటున్నట్లు రిపోర్ట్‌లో వెల్లడైంది. బాల‌వీరాంజ‌నేయ‌ స్వామి, నిమ్మల రామానాయుడు, ఫరూక్ ఫైల్స్ క్లియర్ చేయడానికి సగటున 2 రోజులు తీసుకుంటున్నారు.

మంత్రులలో కొందరు తీవ్ర అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌డం మూలంగా ప‌రిపాలనలో జాప్యానికి దారితీస్తుందని, ప్రజా సమస్యలు పరిష్కారంలో ఆటంకాలు వస్తాయని సీఎం సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. పనితీరు మెరుగుపర్చకపోతే కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని సూచించడంతో మంత్రుల వర్గాల్లో ఆందోళన నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment