అగ్ర కథానాయిక సమంత (Samantha) మరియు దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) సోమవారం వివాహ (Marriage) బంధంలోకి అడుగుపెట్టి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. కోయంబత్తూరు (Coimbatore)లోని ఈశా యోగా సెంటర్ (Isha Yoga Center)లో ఉన్న లింగ భైరవి దేవాలయం (Linga Bhairavi Temple)లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. అయితే, ఈ జంట ‘భూతశుద్ధి వివాహం’ అనే ప్రత్యేక పద్ధతిలో పెళ్లి చేసుకున్నట్లు ఈశా సంస్థ ప్రకటించడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ అరుదైన సంప్రదాయంపై మళ్లింది. అసలు ఏమిటీ భూతశుద్ధి వివాహం? దీని ప్రత్యేకతలు, విశిష్టతలేంటో తెలుసుకుందాం.
భూతశుద్ధి వివాహం
భూతశుద్ధి వివాహం అనేది యోగ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న అత్యంత పవిత్రమైన వివాహ పద్ధతి. పేరుకు తగ్గట్టుగానే ఇది వధూవరుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరిచేందుకు రూపొందించబడిన ప్రక్రియ. ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా, వివాహ జంట దేహాల్లోని పంచభూతాలను (నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) ఈ క్రతువు ద్వారా శుద్ధి చేస్తారని విశ్వసిస్తారు. లింగ భైరవి ఆలయాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహం, దంపతుల దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.
సాధారణంగా హిందూ జంటలకు చేసే సంప్రదాయ మంత్రోచ్చారణలతో పాటు, వధూవరుల శరీరం, మనసు, జీవశక్తి స్థాయులను సమన్వయం చేసే ప్రత్యేక యోగిక క్రతువులతో ఈ వివాహం జరుపుతారు. ఈశా ఫౌండేషన్ మాత్రమే ఈ ప్రత్యేక వివాహాలను నిర్వహిస్తోంది.
సమంత-రాజ్ నిడిమోరులకు ముందు కూడా పలువురు సెలబ్రిటీలు మరియు సామాన్యులు ఈ పద్ధతిలో వివాహాలు చేసుకున్నారు. ఇటీవలే, హిందీ బుల్లితెర నటీనటులు జియా మనేక్, వరుణ్ జైన్ కూడా ఈ ఏడాది ఆగస్టులో ఇదే భూతశుద్ధి వివాహ పద్ధతి ద్వారా ఒక్కటయ్యారు.








“చంద్రబాబుపై ప్రకృతి తిరగబడుతుంది” – పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు