నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత.. సూర్యాపేట జిల్లాలో ఘటన

నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత.. సూర్యాపేట జిల్లాలో ఘటన

సూర్యాపేట (Suryapet) జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ (Elections Nomination) దశలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆత్మకూరు (ఎస్) మండలం పాతర్లపహాడ్ (Patarlapahad) గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించడంతో ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బీఆర్ఎస్ నాయకుల ప్రకారం, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై అధికారులు ఉద్దేశపూర్వకంగా నామినేషన్లను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. ఈ తిరస్కరణలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారి ముందు వాగ్వాదానికి దిగారు. దీనితో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తమ అభ్యర్థుల నామినేషన్లలో ఎలాంటి లోపాలు లేవని, రాజకీయ ప్రేరేపణతోనే తిరస్కరించబడ్డ‌యని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. అయితే, దీనిపై అధికారుల నుంచి ఇప్పటి వరకు పూర్తి వివరణ రాలేదు. పాతర్లపహాడ్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై ప్రశ్నలు లేపుతోంది.

ఈ ఘటన స్థానిక ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ దశ నుంచే ఇలాంటి ఆరోపణలు రావడం ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు రేకెత్తిస్తోందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై ఈ వివాదంపై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment