ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల నేతలు, కార్యకర్తల్లో పదవుల కుంపటి రాజుకుంటోంది. అన్ని పదవులు టీడీపీకేనా అంటూ పలువురు జనసేన, బీజేపీ నేతలు ఇటీవల బహిరంగంగా తమ అసంతృప్తిని వెల్లగక్కడం చూశాం. తాజాగా బద్వేలులో కూటమి నేతల మధ్య పదవుల రగడ నెలకొంది.
బద్వేలు నియోజకవర్గంలో నిన్న జరిగిన సాగునీటి సంఘాల ఎలక్షన్స్ రిజల్ట్ తరువాత నియోజకవర్గ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల్లో జనసేన పార్టీకి కొన్నికేటాయించాలి అని పోరుమామిళ్ల మండల ఇన్ఛార్జ్ శీలంశెట్టి లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.
జనసేనకు పదవులు లేవా?
పోరుమామిళ్లలో లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం జనసేన పార్టీకి ఏ పదవి కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పదవులు మీకేనా? అని టీడీపీని ప్రశ్నించారు, పార్టీ కోసం పోరాటం చేసిన వారు పదవుల నుంచి దూరంగా ఉండడం బాధాకరం అంటూ వాపోయారు. ఇంకొన్నాళ్లు పోతే కూటమి నేతల్లో పదవుల పంచాయితీ తారాస్థాయికి చేరుకుంటుందని పలువురు అంటున్నారు.








