ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

Summarize with AI

బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతతో ఆస్ప‌త్రిలో చేరారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం 97 ఏళ్ల వయస్సు కలిగిన అద్వానీ ఆరోగ్యంపై రాజకీయ వర్గాలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యాక అద్వానీ మీడియా ముందు కనిపించడం అరుదుగా మారింది. రామమందిర ప్రారంభానికి ఆహ్వానం అందినప్పటికీ.. వయసురిత్యా ఇబ్బందులతో ఆయన హాజరుకాలేకపోయారు. మొన్న.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి తర్వాత ప్రధాని మోడీ కూడా అద్వానీ నివాసానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment