ఆ చిన్నారులకు పింఛన్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం!

ఆ చిన్నారులకు పింఛన్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛన్లు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు ఇచ్చారు. వచ్చే 3 నెలల్లో అనర్హులను గుర్తించి, వారి పింఛన్లు కట్ చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఏరివేత త‌రువాత కూడా అనర్హులు బయటపడితే, వారు బాధ్యత వ‌హించాల‌ని సీఎం హెచ్చరించారు.

6 లక్షల మంది అనర్హులా..!
మంత్రి నాదెండ్ల మనోహర్ లెక్క‌ల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అనర్హులకు పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. వారిని గుర్తించి అన‌ర్హుల జాబితాలోకి నెట్టేయాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది.

నెల‌నెలా త‌గ్గుతోంది..
వైసీపీ హ‌యాంలో అర్హ‌త క‌లిగిన ప్ర‌తీ ఒక్క‌రికీ స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా వెరిఫై చేసి జ‌గ‌న్ ప్ర‌భుత్వం పింఛ‌న్లు అందించింది. అధికారం దిగిపోయే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 64 ల‌క్ష‌ల మందికి పింఛ‌న్లు అందిస్తే.. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నెల‌నెలా ఆ సంఖ్య త‌గ్గుతూ వ‌స్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment