బ్యాంక్ గ్యారెంటీతో దుల్కర్ సల్మాన్ కారు విడుదల

బ్యాంక్ గ్యారెంటీతో దుల్కర్ సల్మాన్ కారు విడుదల

Summarize with AI

మలయాళ (Malayalam) స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salman)కు కేరళ (Kerala)  హైకోర్టు (High Court)లో భారీ ఊరట లభించింది. భూటాన్ (Bhutan ) నుంచి అక్రమంగా కార్లను దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణలపై ఇటీవల ఐటీ అధికారులు కేరళలోని పలువురు సెలబ్రిటీల ఇళ్లపై దాడులు నిర్వహించారు.

ఈ దాడులలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) సహా పలువురికి చెందిన సుమారు 20 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. తన కారు సీజ్ (Seized ) చేయడాన్ని సవాలు చేస్తూ దుల్కర్ సల్మాన్ హైకోర్టును ఆశ్రయించారు.

ఆయన పిటిషన్‌ను విచారించిన కోర్టు, సీజ్ చేసిన కారును విడుదల చేసే విషయంపై వారంలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఐటీ అధికారులను ఆదేశించింది. దీంతో దుల్కర్ తన కారు పత్రాలను ఐటీ అధికారులకు సమర్పించారు. ఈ నేపథ్యంలో, దుల్కర్ సల్మాన్‌తో పాటు మరొక వ్యక్తికి చెందిన కారును రిలీజ్ చేయడానికి ఐటీ అధికారులు అంగీకరించారు.

అయితే, ఆ కారు విలువలో 20 శాతం బ్యాంక్ గ్యారెంటీని సమర్పించిన తర్వాతే కారును విడుదల చేయనున్నారు. తక్కువ ధరకు వస్తుందనే కారణంగానే భూటాన్ నుంచి లగ్జరీ కార్లను తెచ్చుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది సెలబ్రిటీలు ప్రస్తుతం తమ కార్ల కోసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

సినిమాల విషయానికి వస్తే, దుల్కర్ సల్మాన్ ఇటీవల ‘లక్కీ భాస్కర్’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగు దర్శకులతో వరుస సినిమాలు లైన్​లో పెడుతూ బిజీగా ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment