వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్

వైసీపీ (YSRCP) ఎంపీ పెద్దిరెడ్డి (Peddireddy) మిథున్ రెడ్డి (Mithun Reddy)కి విజ‌య‌వాడ (Vijayawada) ఏసీబీ కోర్టు (ACB Court) నుంచి కీలక ఊరట లభించింది. అమెరికా (America) పర్యటనకు వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అక్టోబర్ 26వ తేదీ నుంచి న్యూయార్క్‌ (New York)లో జరగనున్న ఐక్యరాజ్యసమితి (United Nations) సర్వసభ్య సమావేశాలకు హాజరు కానున్నారు. పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో స‌భ్యుడిగా ఉన్న‌ మిథున్ రెడ్డి అమెరికా వెళ్లనున్నారు. కోర్టు అనుమతి లభించడంతో ఆయన విదేశీ పర్యటనకు లైన్ క్లియర్ అయినట్టయింది. కేసు దర్యాప్తు జరుగుతున్నప్పటికీ, విదేశీ పర్యటన అవసరాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు, నిర్దిష్ట షరతులతో అనుమతి ఇచ్చింది.

ఈనెల 23 నుంచి నవంబర్ 4 వరకూ ఎంపీ మిథున్‌రెడ్డికి కోర్టు అనుమ‌తిచ్చింది. రూ.50వేలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. సిట్(SIT) అధికారులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులు రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది. న్యూయార్క్ పర్యటన, ఎక్కడ బస చేస్తున్నారన్న వివరాలు కోర్టుకు సమర్పించాలని సూచించింది. పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే పాస్ పోర్టు సిట్ అధికారులకు అప్పగించాలని షరతు విధించింది. న్యూ యార్క్‌కి వెళ్లి రావడానికి తీసిన విమానం టికెట్లు ఫోటో స్టాట్ కాపీలను కోర్టులో సమర్పించాలని ఆదేశించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment