ఆ మూడు చిత్రాలతో కృతిశెట్టి దశ మారుతుందా?

ఆ మూడు చిత్రాలతో కృతిశెట్టి దశ మారుతుందా?

‘ఉప్పెన’ (Uppena) చిత్రంతో టాలీవుడ్‌లో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన నటి కృతిశెట్టి (Krithi Shetty)కి ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. తెలుగులో ఆమె నటించిన ‘ది వారియర్’, ‘కస్టడీ’ వంటి ద్విభాషా చిత్రాలు కూడా నిరాశపరిచాయి. దీంతో ఈ కన్నడ బ్యూటీ కోలీవుడ్‌పై దృష్టి సారించింది. అయితే, తమిళంలో ఆమె నటించిన చిత్రాలు ఏళ్లుగా నిర్మాణంలో ఉండడంతో విడుదల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇప్పుడొక ఊరట కలిగించే విషయం ఏమిటంటే, కృతిశెట్టి నటించిన మూడు తమిళ చిత్రాలు ఒకే నెలలో (డిసెంబర్) తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి.

డిసెంబర్‌ 5న కార్తీకి జంటగా నటించిన ‘వా వాద్దియార్’ (Vaa Vaathiyaar)’ విడుదల కానుంది. అలాగే, ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan)తో కలిసి నటించిన ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ (Love Insurance Company) కూడా డిసెంబర్‌కు వాయిదా పడింది (నిజానికి ఇది దీపావళికి విడుదల కావాల్సింది). ఇక జీవీ. రవిమోహన్‌ (G.V.Ravimohan) హీరోగా, కల్యాణి ప్రియదర్శన్‌ (Kalyani Priyadarshan) మరో నాయికగా నటిస్తున్న మరో చిత్రం కూడా అదే సమయంలో విడుదల కానుంది. ఈ మూడు చిత్రాల్లో ఏ ఒక్కటి విజయం సాధించినా, కృతిశెట్టి కెరీర్‌ మలుపు తిరుగుతుంది. అందుకే ఈ విజయాల కోసం ఆమె ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment