మాజీ సీఎం వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనతో మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ సుధాకర్ మృతిపై టీడీపీ ఏకంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేసి ప్రచారం చేస్తుండగా, వైసీపీ మాత్రం తెలుగుదేశం పార్టీ కుట్రలో డాక్టర్ సుధాకర్ బలి అయ్యాడని పేర్కొంది. ఈ మేరకు నాడు జరిగిన సన్నివేశాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
”అది ఆగస్టు 2019 నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మత్తు డాక్టర్ గా పనిచేస్తున్నసుధాకర్, అదే ఆసుపత్రిలో గైనకాలజిప్ట్ గా ఉన్న డాక్టర్ గౌతమితో శాఖాపరమైన వివాదాలు ఉండటం వలన ఆ కోపం ప్రసవానికి వచ్చిన ఆరుగురు గర్భిణీ స్త్రీలపై వివక్షను చూపి వారికి ఆపరేషన్ కు ఎనస్తీషియా (మత్తు) ఇవ్వకుండా ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకొని అనకాపల్లి నుంచి వెంటనే వేరే మత్తు డాక్టర్ వచ్చి గర్భిణీలకు ఎనస్తీషియా ఇప్పించి ప్రసవం జరిగే విధంగా ఏర్పాటు చేశారు.

మత్తు డాక్టర్ తీరు మొదటి నుండి వివాదాస్పదంగా ఉండటం గతంలో కూడా అనకాపల్లిలో పనిచేస్తునప్పుడు డ్యూటీకి సమయానికి రాకపోవడంతో ప్రశ్నించిన ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ పై దాడి చేసి పోలీసు కేసులో ఉండటంతో సుధాకర్ వ్యవహారశైలిని తప్పుపడుతూ శాసనసభ్యులు ఉమా శంఖర్ గణేష్ తీవ్రంగా మందలించారు. ఇది మనసులో పెట్టుకున్న మత్తు డాక్టర్ సుధాకర్ స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ పై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు.
ఇక ప్రపంచాన్ని వణికించిన కరోనాతో అన్ని దేశాలు పోరాడుతున్న వేళ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ కూడా తమ శక్తికి మించి ప్రజలకి తోడుగా నిలబడి ఉన్న సమయంలో గతంలో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని స్థానిక శాసనసభ్యులు ఉమా శంఖర్, అలాగే జగన్ ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకుని వచ్చేలా చేసి తమ అక్కస్సు తీర్చుకుందాం అనే ఆలోచనతో స్థానిక టీడిపీ నేత అయ్యన్నపాత్రుడి సహకారంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్క్రిప్ట్ లో భాగంగా వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి డాక్టర్లకు మాస్కులు కొరత అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసులని ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు.
దీంతో స్థానిక ఎమ్మెల్యే ఉమా శంకర్.. సుధాకర్, తెలుగుదేశం నేతలు కలిసి చేసిన కుట్ర కోణాన్ని బయట పెటేలా వాస్తవాలని ప్రజలకు తెలిసేలా మత్తు డాక్టర్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు సుమారు గంట సేపు అయ్యన్న పాత్రుడితో రహస్యంగా కలిసిన సీసీ ఫుటేజ్ ని బయట పెట్టారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ విచారణకు ఆదేశించి కుట్ర కోణం బయటపడటంతో డాక్టర్ సుధాకర్ ని విధులనుండి సస్పెండ్ చేశారు.

ఇక సుధాకర్ సస్పెండ్ తో రంగంలోకి దిగిన తెలుగుదేశం.. డాక్టర్ సామాజిక వర్గంతో రాజకీయాలకు తెరలేపుతూ గర్భిణీ స్త్రీలు అని కూడా కనికరం చూపకుండా వారిని గాలికొదిలేసిన మత్తు డాక్టర్ దళితుడు అంటూ సెంటిమెంట్ పాలిటిక్స్ కి తెరలేపారు. ఇది ఇలా ఉండగా సస్పెండ్ అయిన మత్తు డాక్టర్ ముస్లిం, క్రైస్తవ సమాజాన్ని పట్టుకుని పబ్లిక్ గా ముస్లిం, క్రైస్తవులు ఉగ్రవాదులు అంటూ రోడ్ మీద హల్‌చల్ చేసి ఒక సారి వార్తల్లోకి ఎక్కారు.
మరోసారి మత్తుడాక్టర్ కుమారుడు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోర్ట్ పోలీసులు బైక్ సీజ్ చేస్తే సుధాకర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళీ నానా హంగామా చేసి కలకలం రేపారు. మరోసారి విశాఖలో కారులో వెళ్తూ మద్యం మత్తులో బైక్ ను ఢీకొట్టి ప్రమాదానికి పాల్పడటమే కాకుండా స్థానికులని తనకి కరోనా ఉందని వస్తే తమకి అంటిస్తానని బెదిరించడంతో పాటు చొక్కా విప్పీ లారీ కిందపడిపోయే ప్రయత్నం చేస్తే.. పోలీసులు తనని బయటికి లాగా అరెస్ట్ చేశారు. డాక్టర్ సుధాకర్ చేసింది తప్పే అయినా తనపై పోలీసులు అలా ప్రవర్తించినందుకు జగన్ ప్రభుత్వం ఆ సదరు పోలీసులపై క్రమశిక్షణ చర్యలకి పాల్పడింది. ఈ అరెస్టుని కూడా తెలుగుదేశం తమ రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేసింది.
మత్తు డాక్టర్ గా వార్తల్లో నిలిచిన సుధాకర్ ఈ ఘటనలు జరిగిన ఏడాది తరువాత గుండెపోటుతో మరణించారు. మరణానికి ముందే ఒకానొక సందర్భంలో మత్తు డాక్టర్ సుధాకరే అయ్యన్న పాత్రుడు తనని కుక్కలా వాడుకున్నాడని ఆవేదన చెందుతున్న వీడియో సైతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఒక సామాన్యమైన డాక్టర్ ఉద్రేక మనస్తత్వాన్ని తమ రాజకీయాలకి వాడుకుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లబ్దిపొందాలనే ఆలోచన చేసి చివరికీ ఆ వ్యక్తి చేత తప్పులు మీద తప్పులు చేసేలా వెనకనుంచి పోత్సహించి ఆఖరికి తెలుగుదేశం సాధించింది ఎంటి?.. తెలుగుదేశాన్ని నమ్మిన మత్తు డాక్టర్ సుధాకర్ ఏమి సాధించాడు.. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు తెలుగుదేశం మనుకోవాలి. అలాగే తెలుగుదేశం మాటలు నమ్మి వారి ఆటలో పావుగా సామాన్యులు మారద్దొ.. తస్మాత్ జాగ్రత్త..” అంటూ వైసీపీ గతంలో జరిగిన సన్నివేశాలను కళ్లకు కట్టినట్టుగా వివరిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వైసీపీ రిలీజ్ చేసిన సాక్ష్యాధారాలు హాట్ టాపిక్‌గా మారాయి.








