నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ విడుదల

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్ విడుదల

Summarize with AI

‘ఛలో’ సినిమాతో సూపర్ హిట్ అందుకుని వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన హీరో నాగశౌర్య (Naga Shaurya) కొంతకాలంగా తెరపై కనిపించలేదు. చివరగా 2023లో ‘రంగబలి’తో సగటు టాక్‌ను అందుకుని గ్యాప్ తీసుకున్న శౌర్య, ఇప్పుడు ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad Boy Karthik) అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త దర్శకుడు రామ్ దేశిన(Ram Desin) రూపొందించిన ఈ సినిమాను శౌర్య ఎప్పుడో ప్రకటించారు. చాలా కాలంగా సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

టీజర్ రివ్యూ: భారీ ఫైట్లు, రొటీన్ డైలాగ్‌లు
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ పూర్తిగా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. టీజర్‌ (Teaser)ను భారీ ఫైట్స్, రొటీన్ కమర్షియల్ డైలాగ్‌లతో నింపేశారు. చివరిలో వెన్నెల కిషోర్‌తో ఏదో కామెడీని పండించే ప్రయత్నం చేసినా… ఓవరాల్‌గా చూస్తే ఈ టీజర్ ఒక సాధారణ రొటీన్ కమర్షియల్ సినిమా టీజర్ లానే అనిపిస్తోంది. మార్కెట్ పోకడలు మారుతున్న ఈ తరుణంలో, నాగశౌర్యకు ఇలాంటి రొటీన్ కథలు అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ సినిమాలో సీనియర్ నటులు సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్ మరియు శ్రీదేవి విజయ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగశౌర్యకు జోడిగా వీధి హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. వైష్ణవి ఫిలింస్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment