మన్మధుడు నాగార్జున (Nagarjuna) 100వ సినిమాపై తాజా అప్‌డేట్! ఈ మైల్‌స్టోన్ ప్రాజెక్టుకు ‘లాటరీ కింగ్’ (Lottery King)అనే ఆసక్తికరమైన టైటిల్(Title)ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘కుబేర’, ‘కూలీ’ వంటి చిత్రాలలో విలన్ పాత్రలు, నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లు పోషిస్తున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున, తన తదుపరి చిత్రంతో మళ్లీ హీరోగా యూటర్న్ తీసుకోబోతున్నారు. తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను ఆయన లైన్‌లో పెట్టారు.
తమిళ దర్శకుడు రా కార్తీక్ (Ra Karthik) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. మొదట దసరాకే ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించాలని భావించినా, అది కుదరలేదు. ఈ మైల్‌స్టోన్ చిత్రాన్ని చిరస్మరణీయంగా మార్చేందుకు నాగార్జున స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న బజ్ ప్రకారం… 100వ చిత్రంలో నాగార్జునతో పాటు ఆయన కుమారులు, హీరోలు అయిన నాగ చైతన్య మరియు అఖిల్ అక్కినేని కూడా భాగం కాబోతున్నారనే టాక్ నడుస్తోంది. ‘మనం’ తరహాలోనే ఈ ముగ్గురూ కలిసి కనిపించే అవకాశం ఉందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి.
టైటిల్ ఫిక్స్: ‘లాటరీ కింగ్’
అంతేకాకుండా, ఈ చిత్రానికి టైటిల్ కూడా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. అభిమానులు నాగార్జునను ముద్దుగా ‘కింగ్’ అని పిలుస్తారు. ఆ పేరు కలిసి వచ్చేలా ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ చిత్రం ప్యూర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నారు.








