డిప్యూటీ స్పీకర్ అసహనం.. అసెంబ్లీలో ఆసక్తికర ఘటన (Video)

డిప్యూటీ స్పీకర్ అసహనం.. అసెంబ్లీలో ఆసక్తికర ఘటన

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) శాసనసభ (Legislative Assembly)లో జరిగిన ఒక సంఘటన రాజకీయ వర్గాల్లో, నెట్టింట చర్చనీయాంశమైంది. అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల ప్రవర్తనపై డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnaraju) అసహనం (Displeasure) వ్యక్తం చేశారు. సభ జ‌రుగుతున్న స‌మ‌యంలో కొందరు సభ్యులు మాట్లాడుకుంటూ ఉండటాన్ని గమనించిన డిప్యూటీ స్పీక‌ర్ రఘురామ, వెంటనే జోక్యం చేసుకున్నారు. సభ జరుగుతుండగా వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం సరికాదని, అలాంటి వారు బయటకు వెళ్లాలని ఆయన స్పష్టంగా సూచించారు. “సభకు అంతరాయం కలిగించవద్దు” అంటూ ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేశారు.

సభను కంట్రోల్ చేయాల్సిన విప్‌(Whips)లను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారిందన్న డిప్యూటీ స్పీక‌ర్‌ రఘురామ వ్యాఖ్యానించారు. శాస‌న‌ స‌భ‌కు ముందే విప్‌లు స‌మావేశం పెట్టుకుంటే మంచిద‌ని, స‌భ‌లో మాట్లాడుకోవ‌డం త‌గ్గించాల‌ని సున్నితంగా హెచ్చ‌రించారు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment