2029లో కూడా మోడీకి మ‌ద్ద‌తిస్తాం.. – మీడియా చిట్‌చాట్‌లో లోకేష్‌

2029లో కూడా మోడీకి మ‌ద్ద‌తిస్తాం.. - మీడియా చిట్‌చాట్‌లో లోకేష్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh)లో గంజాయి (Ganja)  వాడ‌కం త‌గ్గింద‌ని ఢిల్లీ (Delhi) వేదిక‌గా ఏపీ మంత్రి నారా లోకేష్చె(Nara Lokesh)ప్పారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించిన ఆయ‌న ప‌లు అంశాల‌ను వివ‌రించారు. ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రధాని (Prime Minister)తో చర్చించామని, స్వదేశీ వస్తువులను (Indigenous Products) ప్రోత్సహించాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి వాడకం గణనీయంగా తగ్గిందని, త్వరలో పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని లోకేష్ హామీ ఇచ్చారు.

లిక్కర్ కేసులో ప్రభుత్వానికి ఎలాంటి జోక్యం లేదని, 2029లో కూడా మోడీకి మద్దతు ఇస్తామని లోకేష్ వెల్లడించారు. పలు సందర్భాల్లో కేటీఆర్‌ను కలిసిన విషయంపై స్పందిస్తూ.. “సోషల్ అకేషన్‌లో కలవడంలో తప్పేం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

అధికారంలోకి వ‌చ్చిన 100 రోజుల్లోనే గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో నారా లోకేష్ ప‌లు వేదిక‌ల‌పై ప్ర‌క‌టించారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 15 నెల‌లు కావొస్తున్నా.. గంజాయి ర‌వాణాను అరిక‌ట్ట‌లేక‌పోతోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment