కవిత రాజీనామా.. హ‌రీష్‌, సంతోష్‌రావుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కవిత రాజీనామా.. హ‌రీష్‌, సంతోష్‌రావుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అంద‌రూ ఊహించిందే నిజ‌మైంది. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి స‌స్పెన్ష‌న్ త‌రువాత క‌ల్వ‌కుంట్ల క‌విత (Kalvakuntla Kavitha) ఎమ్మెల్సీ ప‌ద‌వితో పాటు, పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. క‌విత రాజీనామా తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. హైద‌రాబాద్‌ (Hyderabad)లోని తెలంగాణ(Telangana) జాగృతి ఆఫీస్‌ (Jagruthi Office)లో క‌విత ప్రెస్‌మీట్ నిర్వ‌హించి బీఆర్ఎస్ సీనియ‌ర్ లీడ‌ర్లు హ‌రీష్‌రావు, సంతోష్‌రావు, త‌న కేటీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

“నిన్న మధ్యాహ్నం తర్వాత పార్టీ నుంచి ప్రకటన విడుదలైంది. నన్ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పేరుతో సస్పెండ్ చేశామని చెబుతున్నారు. కానీ, నేను బీసీల కోసం, భూ నిర్వాసితుల కోసం, పెన్షన్ పెంపు కోసం పోరాటం చేస్తే అది పార్టీ వ్యతిరేకమా?” అంటూ ప్రశ్నించారు.

కవిత తనపై జరుగుతున్న కుట్రలను బహిరంగంగా ఎత్తిచూపారు. “హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కుట్రలు చేస్తున్నారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్‌. కాళేశ్వరం అవినీతి డబ్బులతోనే ఎమ్మెల్యేలకి ఫండింగ్ చేశారు. రామన్నను ఓడించడానికి డబ్బులు పంపారు. సంతోష్ రావు ఇసుక మాఫియాతో పాటు పదవుల కోసం డబ్బు రాజకీయాలు చేస్తున్నారు. ఈ గ్యాంగ్ కేటీఆర్ పేరు దెబ్బతీస్తోంది” అని కవిత ఆరోపించారు.

“జన్మనిచ్చిన తండ్రి చిటికెన వేలు పట్టుకుని ఉద్యమం చేయడం నేర్చుకున్నా. నాకు పదవులు ముఖ్యం కాదు. వ్యక్తిగత లాభం కోసం కాదు.. కానీ పార్టీని వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తున్న వారిని ఎదుర్కోవాలి. రేపు రామన్న మీ మీద కూడా ఇలాగే కుట్రలు చేస్తారు. జాగ్రత్త” అని హెచ్చరించారు. పార్టీని గట్టిగా నిలబెట్టుకోవాలంటే హరీష్, సంతోష్‌ను పక్కన పెట్టాలని సూచించారు. చివరగా ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి లేఖను తెలంగాణ భవన్‌కు పంపుతున్నట్టు తెలిపారు. సంతోష్‌రావు గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు క‌విత‌. చెప్పులో రాయి.. చెవిలో జోరీగ లాంటివాడ‌ని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment