మ‌ర్డ‌ర్ ప్లాన్ వీడియో విక‌టించిందా..? – ఫొటోలు వైర‌ల్‌

ఎమ్మెల్యే మ‌ర్డ‌ర్‌కు ప్లాన్.. వీడియోలోని వ్య‌క్తుల ఫొటోలు వైర‌ల్‌

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే(MLA) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) హత్యకు భారీ కుట్ర? అంటూ న‌లుగురు వ్య‌క్తులు మ‌ద్యం మ‌త్తులో మాట్లాడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే దీనిపై మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వేగంగా స్పందించి ఎమ్మెల్యే ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని, రౌడీషీట‌ర్ భారీ స్కెచ్ వేశార‌ని బ్రేకింగ్స్ వేసింది. అయితే క్ష‌ణాల్లోనే యువ‌కుల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే వీడియోలో ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ వారు మాట్లాడుకుంటున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆ వీడియోలో మాట్లాడుతుంది రౌడీషీటర్లు జగదీశ్, మహేశ్, వినీత్ అని మెయిన్ స్ట్రీమ్ మీడియా నిర్ధారించింది. ఇదంతా వైసీపీ కుట్ర అని అధికార పార్టీల‌ అనుకూల మీడియా ఛానెల్స్ ప్ర‌సారం చేయ‌గా, దీనిపై ప్ర‌తిప‌క్ష సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు వేగంగా స్పందించారు.

వికటించిన వీడియో?
ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు ప్లాన్ అంటూ వైర‌ల్ అవుతున్న వీడియోలోని వ్య‌క్తులంతా తెలుగుదేశం పార్టీ(TDP)కి చెందిన కార్య‌క‌ర్త‌లేన‌ని ఫొటోలు బ‌య‌ట‌కొచ్చాయి. మర్డర్ ప్లాన్ (Murder Plan) గురించి మాట్లాడుకుంటున్న వారిలో ఉన్న జ‌గ‌దీష్‌, వినీత్‌, మ‌హేష్‌లు నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్ర‌దర్స్‌కు, టీడీపీ క్రియాశీల‌క నేత రూప్‌కుమార్ యాద‌వ్ (Roop Kumar Yadav) అనుచ‌రులేన‌ని తేల్చారు. వీరితో వీడియోల్లోని యువ‌కులు స‌న్నిహితంగా దిగిన ఫొటోలు క్ష‌ణాల్లో బ‌య‌ట‌కొచ్చి వైర‌ల్‌గా మారాయి. అయితే ఈ వీడియో ఉద్దేశ్యపూర్వకంగా రికార్డింగ్ చేశారా..? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కోటంరెడ్డి శ్రీధర్, గిరిలకు జ‌గ‌దీష్‌, మ‌హేష్‌లు అనుచ‌రుల‌ని, మ‌రో యువ‌కుడు వినీత్ రూప్ కుమార్ యాద‌వ్ అనుచ‌రుడ‌ని ఫొటోల ఆధారంగా మాట్లాడుకుంటున్నారు. కాగా, ఈ వీడియో ఎందుకు రికార్డ్‌ చేశారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్న‌ట్లుగా స‌మాచారం.

స్పందించిన నెల్లూరు ఎస్పీ
నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హ‌త్య‌కు సంబంధించిన వీడియోపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. వీడియోలో ఉన్న అంశం త‌మ‌ దృష్టిలో ఉందని, ఈ అంశంపై విచారణ జరుపుతున్నామని, త్వరలో పూర్తి విషయాలు చెబుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యేతో మాట్లాడతామ‌ని, ఆయన కోరితే రక్షణ కల్పిస్తామ‌ని ఎస్పీ శ్రీకాంత్ తెలిపిన‌ట్లుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్ర‌సారం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment