ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఆర్థిక పరిస్థితి (State Financial Situation) తీవ్రంగా అస్తవ్యస్తంగా మారిందని మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగ్ (CAG) గణాంకాలను ఆధారంగా చేసుకుని ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో వైసీపీ(YSRCP) పాలనలో అబద్ధాలు ప్రచారం చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాకే వాస్తవాలు బయటపడుతున్నాయని జగన్ అన్నారు.
జగన్ ట్వీట్‌లో పేర్కొన్న ప్రకారం, 2019–24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు అసత్య ఆరోపణలు చేశాయని, అప్పులు పెరిగాయని, ఆదాయం తగ్గిందని విమర్శించాయని గుర్తు చేశారు. కానీ, టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం (Coalition Government) ఏర్పడిన తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయ వృద్ధి కేవలం 3.08 శాతం మాత్రమే ఉండటం ఆర్థిక పరిపాలన వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఇదే సమయంలో కేంద్ర ఆదాయం 12.04 శాతం పెరిగిందని పోల్చిచూపారు.
ఇదే క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లోనూ పరిస్థితి మరింత దిగజారుతోందని జగన్ పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ(GST), అమ్మకాల పన్నుల్లో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తోందని, మొదటి నాలుగు నెలల్లో ప్రభుత్వ ఆదాయ వృద్ధి కేవలం 2.39 శాతం మాత్రమే నమోదైందని వివరించారు. కనీసం 10 శాతం వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.
రాష్ట్ర అప్పులు వేగంగా పెరుగుతున్నాయని మరో ముఖ్యాంశాన్ని జగన్ ప్రస్తావించారు. 2019–24లో మొత్తం రూ.3.32 లక్షల కోట్లు అప్పులు చేయగా, కేవలం 14 నెలల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్ల అప్పులు (Loans) చేసింది. అంటే గత ఐదేళ్లలో తీసుకున్న అప్పులో 56 శాతం అప్పులు ఒకే ఏడాదిలో చేయడం అత్యంత ఆందోళనకరమని విమర్శించారు. ఈ పరిస్థితి అవినీతికి దారి తీస్తోందని, వెంటనే చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం (Government) తమ విధానాలను పునరాలోచించుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.
𝙏𝙝𝙚 𝘾𝘼𝙂 𝙛𝙞𝙜𝙪𝙧𝙚𝙨 𝙧𝙚𝙫𝙚𝙖𝙡 𝙘𝙤𝙣𝙩𝙞𝙣𝙪𝙞𝙩𝙮 𝙤𝙛 𝙛𝙞𝙨𝙘𝙖𝙡 𝙨𝙩𝙧𝙚𝙨𝙨
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025
During the five year period, 2019-24, the then opposition parties TDP and JSP continuously lied that the then Government’s policies were resulting in unchecked growth in liabilities and… pic.twitter.com/X0JeWvpxVE








