సచిన్ కాబోయే కోడలు ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా..?

సచిన్ కాబోయే కోడలు సానియా చందోక్ ఆస్తి వివరాలు

Summarize with AI

భారత క్రికెట్ (India Cricket) దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబై(Mumbai)కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ (Ravi Ghai) మనవరాలు సానియా చందోక్ (Sania Chandok) అర్జున్ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఈ విషయంపై ఇరు కుటుంబాలు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నెటిజన్లు సానియా నేపథ్యం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఎవరు ఈ సానియా చందోక్?
ముంబైకి చెందిన సానియా చందోక్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆమెకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఈ ఆసక్తితోనే 2022లో ఆమె ముంబైలో ‘మిస్టర్ పావ్స్ పెట్ స్పా అండ్ స్టోర్’ అనే లగ్జరీ పెట్ స్పాను స్థాపించారు. ఈ కేంద్రంలో పెంపుడు జంతువులకు గ్రూమింగ్, స్పా, కొరియన్, జపనీస్ థెరపీల వంటి ప్రత్యేక సేవలు అందిస్తారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం, ఈ కంపెనీ వార్షిక ఆదాయం దాదాపు రూ. 87 కోట్లు.

సానియా తాత రవి ఘాయ్ ముంబైలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఆయన గ్రావిస్ గ్రూప్ యజమాని. ఈ గ్రూప్ బాస్కిన్-రాబిన్స్ ఇండియా, బ్రూక్లిన్ క్రీమరీ ఐస్‌ క్రీమ్ వంటి ప్రముఖ బ్రాండ్లను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ కార్యకలాపాల్లో సానియా చురుగ్గా పాల్గొంటున్నారని తెలుస్తోంది. ముంబైలోని ప్రముఖ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ కూడా వీరి కుటుంబానికి చెందినదే.

ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 624 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 20% ఎక్కువ. ఈ వ్యాపారం ఎక్కువగా ఆహారం, హాస్పిటాలిటీ రంగాలలో కొనసాగుతోంది. అయితే, సానియా తండ్రి గౌరవ్ ఘాయ్‌కు తన తాత రవి ఘాయ్‌తో కొన్ని కుటుంబ వివాదాలు ఉన్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment