వరద ముంపులో అమరావతి.. చెరువులా ఐకానిక్ టవర్స్ ప్రాంతం

వరద ముంపులో అమరావతి.. చెరువులా ఐకానిక్ టవర్స్ ప్రాంతం

ఎడతెరిపి లేని భారీ వర్షాలతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అమరావతి రాజధాని మళ్లీ వరద ముంపులో చిక్కుకుంది. గుంటూరు వైపు నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాడికొండ మండలం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆరు గంటలపాటు వాహనాల కదలికలు ఆగిపోయాయి. పెదపరిమి, కంతేరు, అయ్యన్నవాగు, పాలవాగు పొంగి రహదారులపైకి నీరు చేరింది.

అమ‌రావ‌తి ప్రాంతంలో నిర్మాణాల వల్ల పాలవాగు, అయ్యన్నవాగులు తమ సహజ ప్రవాహాన్ని కోల్పోయాయి. రోడ్ల ఎత్తు పెంచడం, వాగులను మూసివేయడం వల్ల వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లే మార్గం లేకపోవడంతో 40 వేల ఎకరాల పంటలు ముంపులో మునిగిపోయాయి.

ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు, వంతెన నిర్మాణం వంటి పనుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో కొండవీటి వాగు నుంచి నీరు సాఫీగా ప్రవహించేది, కానీ ఇప్పుడు రిజర్వాయర్లు, ఇతర నిర్మాణాల పేరుతో ప్రవాహ మార్గాలు మూసివేయడం ఈ విపత్తుకు కారణమైందని విమర్శలు వినిపిస్తున్నాయి.

నీట మునిగిన అమరావతి ఐకానిక్ టవర్స్
అమరావతిలో ఐకానిక్ టవర్ నిర్మాణం చేప‌ట్టే ప్రాంత‌మంతా నీట మునిగింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు చేరి చెరువును త‌ల‌పిస్తోంది. రాయపూడిలో నిర్మాణం జ‌రుగుతున్న ఐకానిక్ ట‌వ‌ర్ నీట‌మునిగిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. గ‌త రెండు రోజుల క్రితమే డీ వాటరింగ్ పనులు పూర్తి చేశారు అధికారులు. తిరిగి మళ్లీ మునగడంతో డీ వాటరింగ్ కాంట్రాక్ట్ కోసం తీవ్ర పోటీ నెల‌కొన్న‌ట్లుగా సెటైర్లు పేలుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment