కాలేజీ రోజుల్లో చెప్పుతో కొట్టాడ‌నే పెద్దిరెడ్డిపై బాబుకు ప‌గ‌ – వైఎస్ జ‌గ‌న్

కాలేజీ రోజుల్లో చెప్పుతో కొట్టాడ‌నే పెద్దిరెడ్డిపై బాబుకు ప‌గ‌ - వైఎస్ జ‌గ‌న్

నెల్లూరు (Nellore) ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మాజీ (Former) సీఎం (CM) వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి (YS Jaganmohan Reddy) కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government)పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో రెడ్ రాజ్యాంగం (Red Constitution)లో ఎమర్జెన్సీ త‌ర‌హా పరిస్థితులు నెల‌కొన్నాయ‌ని ఆరోపించారు. త‌న ప‌ర్య‌ట‌న‌కు ఆంక్ష‌లు విధించ‌డ‌మే కాకుండా.. ద్విచ‌క్ర వాహ‌నాలు రాకుండా జేసీబీల‌తో మోకాళ్లోతు గోతులు తీయించ‌డం ఏంటీ..? అని ప్ర‌శ్నించారు. నెల్లూరు పర్యటనలో భాగంగా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డితో ములాఖత్‌ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వైసీపీ నేత‌ల‌పై త‌ప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని చెబుతూ కాలేజీ డేస్‌ (College Days)లో సీఎం(CM) చంద్ర‌బాబు (Chandrababu), మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Peddi Reddy) రామచంద్రారెడ్డి (Ramachandra Reddy)ల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌ను వివ‌రించారు. కాలేజీలో చదువుకున్నప్పుడు చంద్రబాబును పెద్దిరెడ్డి చెప్పు (Slipper)తో కొట్టాడని, ఆ ప‌గ‌తోనే ఎంపీ(MP) మిథున్‌రెడ్డి (Mithun Reddy)ని చంద్ర‌బాబు జైలు(Jail)కు పంపించాడని వ్యాఖ్యానించారు. చిన్నప్పుడు జరిగిన ఘటను గుర్తు పెట్టుకొని చంద్ర‌బాబు శాడిస్ట్‌గా వ్యవహరిస్తున్నాడ‌న్నారు. సంవత్సరాల తరువాత జ‌రిగిన కాలేజీ గొడ‌వ‌ను గుర్తుపెట్టుకొని పెద్దిరెడ్డి కొడుకును జైల్లో పెట్టించాండంటే చంద్ర‌బాబులో రాక్షసత్వం ఎంత ఉందో అర్థం చేసుకోవాల‌న్నారు.

చంద్రబాబు త‌ప్పుడు సంప్రదాయానికి విత్తనం విత్తుతున్నాడ‌ని, ఇదే విత్తనం రేపు వృక్షం అవుతుందన్నారు వైఎస్ జ‌గ‌న్‌. ఎల్లకాలం చంద్ర‌బాబే ముఖ్యమంత్రిగా ఉండడ‌ని, మరో మూడేళ్ల తరువాత వచ్చేది వైసీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ మారిన త‌రువాత చంద్రబాబుకు, తప్పులు చేస్తున్న‌ అధికారులకు లెక్క జమ తీసి, చట్టం ముందు నిలబెడుతామ‌న్నారు. చంద్ర‌బాబు చేస్తున్న‌దానికి రేపు పొద్దున రెండంతలుగా ఉంటుంద‌న్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మేల్కోని, వైఖరిని మార్చుకోవాల‌ని సూచించారు.

ఇప్పుడు చంద్ర‌బాబు ఆదేశాల‌తో త‌ప్పుడు అన్యాయంగా ప్ర‌వ‌ర్తిస్తున్న అధికారుల‌ను సైతం వ‌దిలిపెట్టేది లేద‌ని వైఎస్ జ‌గ‌న్ హెచ్చ‌రిక చేశారు. కొంత మంది అధికారులు రిటైర్డ్‌ అవుతాం, వీఆర్‌ఎస్‌ తీసుకొని విదేశాలకు వెళ్తామని అనుకోవచ్చని, సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. రిటైర్డ్‌ అయినా, వీఆర్‌ఎస్‌ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కర్నీ కూడా పిలపించి చేసిన ప్రతి పనికి చట్టం ముందు నిలబెడతామ‌న్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా శిక్ష పడేలా అడుగులు పడుతాయి’ అంటూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment