పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం: కేంద్రం బిల్లులకు రెడీ, విపక్షాల నిరసన!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం: కేంద్రం బిల్లులకు రెడీ, విపక్షాల నిరసన!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో 8 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు, విపక్షాలు వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ డిమాండ్లు, వాయిదా తీర్మానాలతో సిద్ధమయ్యాయి.

విపక్షాల డిమాండ్లు, వాయిదా తీర్మానాలు
ప్రధానంగా పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్, బిహార్ ఓటర్ల జాబితా వంటి అంశాలపై వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి.

కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ, పహల్గామ్ దాడిపై తప్పనిసరిగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఇంటిలిజెన్స్ వైఫల్యం, ఉగ్రవాదులను అరెస్టు చేయకపోవడంపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు.

డీఎంకే ఎంపీ టీఆర్ బాలు పహల్గామ్ దాడిపై ప్రధానమంత్రి జవాబు చెప్పాలని పేర్కొన్నారు.

కాల్పుల విరమణపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. అయితే, బీజేపీ ఎంపీ దామోదర్ అగర్వాల్ ఈ అంశంపై ప్రధాని మోదీ ఇప్పటికే సమాధానం చెప్పారని పేర్కొన్నారు.

బీఏసీ సమావేశాలు
పార్లమెంటు సమావేశాల అజెండాను ఖరారు చేసేందుకు బీఏసీ సమావేశాలు జరగనున్నాయి. లోక్‌సభ బీఏసీ మధ్యాహ్నం ఒంటిగంటకు, రాజ్యసభ బీఏసీ రెండున్నరకు సమావేశం కానుంది. ఉభయ సభల్లో చర్చకు రావాల్సిన అంశాలను ఈ బీఏసీ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment