ఆడబిడ్డ కి జన్మనిచ్చిన హీరోయిన్ కియారా అద్వానీ

ఆడబిడ్డ కి జన్మనిచ్చిన హీరోయిన్ కియారా అద్వానీ

బాలీవుడ్ స్టార్ (Bollywood Star) కపుల్ కియారా అద్వానీ (Kiara Advani) – సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) దంపతులు అభిమానులకు సంతోషకరమైన వార్తను అందించారు. ఈ జంట తాజాగా తల్లిదండ్రులు అయ్యారు. ముంబయి(Mumbai)లోని రిలయన్స్ ఆసుపత్రి (Reliance Hospital)లో కియారా పండంటి ఆడబిడ్డ (Baby Girl)కు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన కియారా-సిద్ధార్థ్ జంట, ఇప్పుడు తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈ శుభవార్తపై వారి అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

2021లో విడుదలైన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన పాపులర్ వార్ డ్రామా ‘షేర్షా’ ద్వారా కియారా-సిద్ధార్థ్ కాంబినేషన్ తొలిసారిగా వెండితెరపై మెరిసింది. ఈ సినిమాలో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోగా, షూటింగ్ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కియారా గతంలో ‘కాఫీ విత్ కరణ్ – సీజన్ 8’లో మాట్లాడుతూ, ఇటలీలోని రోమ్‌లో సిద్ధార్థ్ తనను ప్రేమగా ప్రపోజ్ చేశాడని వెల్లడించింది. ఆ తర్వాత ఇద్దరూ 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

కెరీర్ పరంగా కూడా ఈ జంట బిజీగా ఉంది. కియారా నటించిన భారీ ప్రాజెక్ట్ ‘వార్ 2’ ఈ ఆగస్టు 14న విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు, సిద్ధార్థ్ మల్హోత్రా – జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పరమ్ సుందరి’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment