SSMB 29లో మహేష్ బాబు తండ్రిగా మాధవన్?

SSMB 29లో మహేష్ బాబు తండ్రిగా మాధవన్?

Summarize with AI

మహేష్ బాబు (Mahesh Babu)-ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ చిత్రం “SSMB 29″పై అంచనాలు భారీగా ఉన్నాయి. హాలీవుడ్‌ (Hollywood)కు దీటుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేస్తున్నారని సమాచారం.

తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో కోలీవుడ్ (Kollywood) స్టార్ ఆర్. మాధవన్ (R. Madhavan) కీలక పాత్రలో, మహేష్ బాబుకు తండ్రి (Father)గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం మొదట నానా పాటేకర్, విక్రమ్‌లను సంప్రదించినా, చివరకు మాధవన్ ఓకే చెప్పారని సమాచారం.

అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. కానీ, ఇటీవల ఒరిస్సాలో జరిగిన షెడ్యూల్ నుంచి కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయి. మహేష్ బాబును రౌడీలు లాక్కు రావడం, పృథ్వీ రాజ్ సుకుమారన్ కనిపించడం వంటి దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ లీకుల పట్ల రాజమౌళి తన బృందాన్ని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. అప్పటి నుంచి SSMB 29 నుంచి ఎలాంటి లీకులు బయటకు రాలేదు.

మాధవన్ వంటి స్టార్ నటుడి చేరిక వార్తలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment