కాంగ్రెస్ పాలనలో పథకాల పూర్తిగా ప‌త‌నం: హరీష్ రావు

కాంగ్రెస్ పాలనలో పథకాల పూర్తిగా ప‌త‌నం: హరీష్ రావు

Summarize with AI

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ (BRS) నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలలో, కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రజా ప్రయోజన పథకాలను నిలిపివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హరీష్ రావు మాట్లాడుతూ, “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్, గ్యాస్ బండకు రాయితీ బంద్, రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్, గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్.. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బందయినట్టే” అని తీవ్రంగా విమర్శించారు. “ఆత్మశుద్ధిలేని యాచార మదియేల, భాండశుద్ధి లేని పాకమేల?” అనే సామెతను ఉటంకిస్తూ కాంగ్రెస్ నైతికతను ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పై ప్రధాన ఆరోపణలు:
బీఆర్‌ఎస్ ప్రారంభించిన పథకాలను అటకెక్కించారని, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలును గాలికి వదిలేశారని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “మాటలు కోటలు దాటి పరుగులు తీసినా, చేతల పరంగా మాత్రం ప్రజలు ఇంకా నిరీక్షణలోనే ఉన్నారు” అని హరీష్ వ్యాఖ్యానించారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదని, “పాలన అంటే ప్రతిపక్షాలపై కక్ష సాధించడమేనా?” అంటూ ఆయన ప్రశ్నించారు. యాదవ, కురుమ వర్గాలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

“వంద రోజులలో గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పిన వాడివి, కానీ ఇప్పటి దాకా డీడీ (DD) డిపాజిట్ చేసిన వారి సొమ్ము కూడా తిరిగి ఇవ్వలేని దుస్థితి మీది. మాటలు విని విసిగిపోయిన యాదవ, కురుమ సోదరులు గాంధీ భవన్‌ ముందు గొర్రెలతో నిరసన” అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. చివరగా, “మీ మోసాన్ని ప్రజలు గుర్తుంచుకుంటారు.. ఇంకా జాగ్రత్త పడకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదు” అని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment