విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన బీడీ ముక్క

విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన బీడీ ముక్క

Summarize with AI

కన్నతండ్రి నిర్లక్ష్యంతో ఓ నిరుపేద కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని మంగళూరు (Mangaluru)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రి (Father) కాల్చి పడేసిన బీడీ(Beedi) ముక్కను నోట్లో (Mouth) పెట్టుకున్న 10 నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

మంగళూరు నగర శివారు అడ్యార్ (Adyar) ప్రాంతంలో బీహార్‌ (Bihar)కి చెందిన లక్ష్మీదేవి కుటుంబం (Lakshmidevi Family) నివసిస్తోంది. రోజువారీ పనులతో జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో విషాదం నెలకొంది. మంగ‌ళ‌వారం లక్ష్మీదేవి భర్త కాల్చిన బీడీ చివరి ముక్కను కింద పడేసాడు. అక్కడే ఆడుకుంటున్న చిన్నారి అనీశ్‌కుమార్‌ (Aneesh Kumar) (10 నెలలు) దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా బాధపడ్డాడు. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా బీడీ ముక్కను బయటకు తీయలేకపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే బాలుడు మృతి (Death) చెంది ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment