కరోనా మహమ్మారి (Corona pandemic) మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కడప జిల్లాలో (Kadapa District) 75 ఏళ్ల వృద్ధురాలికి (Elderly Woman) పాజిటివ్ (Positive) గా నిర్ధారణ అయిందని వైద్యులు చెబుతున్నారు. వృద్ధురాలికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. జ్వరంతో కడప రిమ్స్ (Kadapa RIMS) లో చేరిన నంద్యాల (Nandyala) జిల్లా చాగలమర్రికి (Chagalamarri) చెందిన వృద్ధురాలికి..వైద్య పరీక్షల్లో కరోనాగా (Corona) నిర్ధారణ అయిందని డాక్టర్లు నిర్ధారించారు.
స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో తాజాగా మరో కేసు కూడా నమోదు అయినట్లు వార్తలు వస్తున్నా, అధికారిక సమాచారం వెలువడాల్సింది. గత వారం రాజులుగా కొన్ని రాష్ట్రాలకు పరిమితం అయిన కరోనా కేసులు.. తాజాగా ఏపీలోనూ నమోదవ్వడం సంచలనంగా మారింది. మళ్లీ కరోనా బయటపడటం స్థానికులను ఆందోళనలోకి నెట్టింది.
ఈ నేపథ్యంలో వైద్య శాఖ (Health Department) అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ఆసుపత్రిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ, కరోనా లక్షణాలతో ఉన్నవారిని వేరు చేసి నిర్దిష్ట విభాగాలకు తరలించారు. సంబంధిత వారిని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
కరోనా మళ్లీ చాపకింద నీరులా వ్యాపించకుండా నివారించేందుకు ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవసరం లేని ప్రయాణాలు, గుంపులుగా గుమిగూడడం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
ఇలా మళ్లీ కరోనా కేసులు రావడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య నియమాలను తప్పక పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది








