మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తన సుదీర్ఘ ప్రెస్‌మీట్‌లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు. గురువారం జరిగిన ప్రెస్‌మీట్‌లో పవన్ కళ్యాణ్‌పై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. కాకినాడ పోర్టులో జరిగిన ‘సీజ్ ది షిప్’ (Seize the Ship) ఘటనపై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై జగన్ సెటైర్లు (Satires) పేల్చారు. విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా “షిప్.. సీజ్ అంటూ ఇష్టం వచ్చినట్లు అధికారులపై ఆరోపణలు చేశారు. చివరికి సీజ్ పోయింది… షిప్ పోయింది… బియ్యమూ పోయాయి!” అని జగన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉండడం గమనార్హం.
కాకినాడ పోర్టు (Kakinada Port) నుంచి విదేశాలకు పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ అంటూ గత కొన్ని నెలల క్రితం ఓ షిప్‌ను అధికారులు గుర్తించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి షిప్‌ను పరిశీలించి.. సీజ్ ది షిప్ అని డైలాగ్‌ను వాడారు. అప్పట్లో ఆ డైలాగ్ సంచలనంగా మారింది. మీమ్స్, వీడియోస్‌తో పవన్‌ను ట్రోల్ చేశారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో పోర్టులో పార్క్ చేసిన ట్వీట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్‌కు చేదు అనుభవం ఎందరైందని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి.
ఇవాళ జరిగిన వైఎస్ జగన్ ప్రెస్‌మీట్‌లో ఓ మీడియా ప్రతినిధి పీడీఎస్ బియ్యం, పవన్ గురించి ప్రస్తావించగా, సీజ్ పోయింది… షిప్ పోయింది… బియ్యమూ పోయాయి అని సెటైర్లు వేశారు. గత ప్రెస్‌మీట్‌లోనూ పవన్ కళ్యాణ్ గురించి ఒక విలేకరి అడిగి ప్రశ్నకు సైతం జగన్ వ్యంగ్యంగా స్పందించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కి తక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ అని స్పందించిన విషయం తెలిసిందే. గతంలో ఈ వీడియోను కూడా వైసీపీ శ్రేణులు తెగ వైరల్ చేశారు. ప్రస్తుతం షిప్ పోయింది.. బియ్యమూ పోయాయి వీడియో ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.







