వీర జ‌వాన్ కుటుంబానికి వైసీపీ చెక్కు అందజేత (Video)

వీర జ‌వాన్ కుటుంబానికి వైసీపీ చెక్కు అందజేత (Video)

దేశ సరిహద్దుల్లో ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)లో భాగంగా జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ (Murali Naik) కుటుంబానికి వైసీపీ (YSRCP) అండ‌గా నిలిచింది. దేశానికి ముర‌ళీనాయక్ సేవలకు గౌరవంగా, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంగా పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి (Former Chief Minister) వైఎస్ జ‌గ‌న్ (Y.S. Jagan) ప్ర‌క‌టించారు. ఇచ్చిన మాట ప్ర‌కారం మూడు రోజుల్లోనే పార్టీ నేత‌లతో రూ.25 లక్షల చెక్కు (Cheque) ను వీర జ‌వాన్ కుటుంబానికి (Soldier Family) అందించారు.

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 13న మురళీ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చి, వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరవదన్నారు. ఇదే సందర్భంలో ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆర్థిక సాయం చెక్కును శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ (Usha Sricharan) శుక్ర‌వారం మురళీనాయ‌క్‌ స్వగ్రామమైన కల్లి తండాకు వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment