పందెం కోడి సినిమాతో వెండి తెరకు పరిచయమై, ఆ తరువాత తన నటనతో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న నటుడు విశాల్ (Vishal) ఆరోగ్యంపై (Health) ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలో ఓ సినిమా ఈవెంట్‌లో వణుకుతూ (Shivering) మాట్లాడిన విశాల్.. తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడులోని (Tamil Nadu) విల్లుపురం (Villupuram) లో ఆదివారం జరిగిన ట్రాన్స్‌జెండర్ అందాల పోటీ (Transgender Beauty Pageant)లో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాల్, వేదికపై ఉన్న సమయంలో అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు.
వెంటనే పక్కనే ఉన్నవారంతా అలర్ట్ అయ్యారు. సిబ్బంది, నిర్వాహకులు స్పందించి ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆయన స్పృహలోకి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటన అభిమానుల్లో ఆందోళన రేపింది. కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు, విశాల్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు. బిజీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా మధ్యాహ్నం భోజనం చేయలేదని, అందువల్లే కళ్లు తిరిగి పడిపోయారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.
గతంలోనూ ఆయన ఆరోగ్య సమస్యలకు లోనైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మదగజరాజు సినిమా ఈవెంటలో విశాల్ తీవ్రమైన షివరింగ్‌తో కనిపించాడు. మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బందులు పడినట్లుగా చూశాం. కళ్తు తూడుచుకోవడం, మైక్ పట్టుకొని వణుకుతూ ఉండిపోయాడు. నోటి నుంచి మాట కూడా కష్టం వచ్చింది. ఇది చూసిన వారంతా విశాల్‌కు ఏమైందన్న ఆందోళన కోలీవుడ్ యాక్టర్స్‌తో పాటు ఫ్యాన్స్‌లో కూడా కలిగింది. విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని, అందువల్లే అలా ఉన్నాడని ఆందోళనను అప్పట్లో సద్దుమణించారు. తాజాగా స్టేజీ పైనే విశాల్ కుప్పకూలిపోవడం భయభ్రాంతులకు గురిచేసింది. విశాల్‌కు గత కొద్దరోజులుగా ఏమైంది..? ఆరోగ్యంగా ఉన్నాడా..? ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారా..? దీనికి గల కారణం ఏంటన్న ప్రశ్నలు అభిమానుల మనసులను తొలుస్తున్నాయి.








