భార‌త్‌కు ర‌ష్యా మ‌ద్ద‌తు.. ప్ర‌ధానికి పుతిన్ ఫోన్‌

Vladimir Putin, PM Narendra Modi, Pahalgam Terror Attack, Russia-India Relations, Terrorism, Jammu and Kashmir, International Support, Indian Foreign Policy, MEA India, Annual Summit Invitation,

Summarize with AI

పాక్‌పై యుద్ధానికి (War) సిద్ధ‌మ‌వుతున్న భార‌త్‌ (India) కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. అగ్ర‌రాజ్యం అమెరికా (America) నుంచి స‌పోర్ట్ రాగా, తాజాగా రష్యా (Russia) కూడా ఇండియాకు మ‌ద్ద‌తు తెలిపింది. ప్ర‌ధాని మోడీ (Modi)తో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు. జ‌మ్మూకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) తీవ్రంగా స్పందించారు. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ (Phone) చేసి సానుభూతి తెలిపారు.

“పాకిస్తాన్‌ (Pakistan) హేయమైన చ‌ర్య‌ను ర‌ష్యా ప్రెసిడెంట్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. అమాయకుల ప్రాణనష్టం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదానికి (Terrorism) వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేశారు. ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులు మరియు వారికి సహకరించినవారు న్యాయ పరిధిలోకి రావలసిందేనని పుతిన్ స్పష్టం చేశారు” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ సంభాషణలో భాగంగా, భారత ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడిని ఈ ఏడాది భారతదేశంలో జరగనున్న వార్షిక శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించారు.

భార‌త్‌కు అమెరికా కూడా మ‌ద్ద‌తు తెలిపింది. ఇటీవ‌ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ కు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి హెగ్సేత్ ఫోన్ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలకు తాము మద్దతిస్తామని అగ్ర‌రాజ్యం రక్షణ శాఖ కార్యదర్శి వెల్ల‌డించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment