‘రైడ్‌ 2’ లో తమన్నా స్పెషల్‌ సాంగ్‌.. మేక‌ర్స్‌ క్లారిటీ

'రైడ్‌ 2' లో తమన్నా స్పెషల్‌ సాంగ్‌.. మేక‌ర్స్‌ క్లారిటీ

Summarize with AI

‘స్త్రీ 2’లో “ఆజ్ కీ రాత్” పాటతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన తమన్నా (Tamannaah), ఇప్పుడు అదే జోష్‌తో ‘రైడ్‌ 2 (Ride 2)’లో స్పెషల్ సాంగ్‌తో అలరించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ పాటకు మంచి స్పందన వస్తున్నప్పటికీ, ఇది కేవలం ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ (Promotional Song) అని సోషల్ మీడియా కొడైకూస్తోంది. ఈ పాట మూలంగా సినిమాకు ‘యూ/ఏ’ వచ్చిందంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఈ వార్తలపై తాజాగా స్పందించిన నిర్మాతలు వివ‌ర‌ణ ఇచ్చారు. ‘‘ఈ పాట కథలో భాగమే. కేవలం గ్లామర్‌కు కాదు. థ్రిల్లర్ సినిమాల్లో ఇలాంటి సాంగ్స్ కొన్నిసార్లు జోడించబడ్డట్టే అనిపించవచ్చు, కానీ కథని చూస్తే ఆ అవసరం స్పష్టంగా తెలుస్తుంది’’ అని నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. ‘యూ’ సర్టిఫికెట్‌ రావాలంటే కొన్ని సన్నివేశాల్లో కట్స్‌ చేయాలని బోర్డు సూచించిందని, కానీ తాము కథలో మార్పులు చేయకూడదన్న ఉద్దేశంతో బోర్డు సూచ‌న‌ల‌కు అంగీక‌రించ‌లేద‌న్నారు. అందుకే ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ వచ్చిందన్నారు.

అజయ్ దేవ్‌గణ్‌ (Ajay Devgn) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రైడ్‌ 2’ సినిమాను రాజ్‌కుమార్ గుప్తా (Rajkumar Gupta) క్రైమ్ థ్రిల్లర్‌ (Crime Thriller)గా తెరకెక్కిస్తున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు ఈ వివాదాలపై స్పష్టత రావడంతో ప్రేక్షకులలో ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment