సచిన్ కూతురితో ప్రేమ.. శుభ్‌మ‌న్‌ గిల్ క్లారిటీ

సచిన్ కూతురితో ప్రేమ.. శుభ్‌మ‌న్‌ గిల్ క్లారిటీ

భార‌త స్టార్ క్రికెట‌ర్ శుభ్‌మ‌న్ గిల్ బాలీవుడ్ నటితో, ఓ ప్రముఖ క్రికెటర్ కూతురితో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయాలపై స్పందించాడు. ముఖ్యంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్క‌ర్‌తో ఆయన ప్రేమలో ఉన్నాడని వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి.

అయితే, ఈ గాసిప్స్‌పై గిల్ సూటిగా స్పందించాడు. ‘‘నాకు సంబంధించిన ఎన్నో పుకార్లు వస్తుంటాయి. నిజానికి నేను మూడేళ్లుగా సింగిల్‌గా ఉన్నాను. అప్పటినుంచి ఏ సంబంధం కూడా లేదు. నేనెప్పుడూ కలవని వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు చెబితే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఊహించండి’’ అని గిల్ ఘాటుగా చెప్పాడు.

తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లను తక్కువగా తీసుకుంటానని, వాటిని చూసి కేవలం నవ్వుకుంటానని గిల్ తెలిపాడు. తాను ఎవ‌రితోనూ రిలేష‌న్‌లో లేన‌ని క్లారిటీ ఇచ్చాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment