తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న సీక్వెల్ మూవీ ‘జైలర్ 2 (Jailer 2)’కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘జైలర్’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో ఇప్పటికే పలు ప్రముఖ నటులు గెస్ట్ రోల్స్‌కి ఎంపికైనట్టు వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా మలయాళ టాలెంటెడ్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) కూడా ఈ భారీ ప్రాజెక్టులో భాగమవుతున్నట్టు సమాచారం. గతంలో రజినీకాంత్‌తో కలిసి ‘వేట్టయాన్’ సినిమాలో నటించిన ఫహాద్, ఈ సారి ‘జైలర్ 2’లో రజినితో మళ్లీ స్క్రీన్ షేర్ చేయనున్నాడని ఇండస్ట్రీ టాక్. దీనితో సినిమా మీద ఉన్న హైప్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.