---Advertisement---

కలలో కూడా ఊహించలేరు… ఉగ్రవాదులకు మోదీ హెచ్చ‌రిక!

కలలో కూడా ఊహించలేరు… ఉగ్రవాదులకు మోదీ హెచ్చ‌రిక!
---Advertisement---

జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir)లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి (Terror Attack) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అమాయకులపై చేసిన ఈ దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్రంగా ఖండించారు. ఈ దాడిపై బిహార్ (Bihar)లో గురువారం జరిగిన ఓ సభలో మాట్లాడిన ప్రధాని, ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ దుర్మార్గమైన దాడికి పాల్పడినవారిని ఎక్కడున్నా వెత‌కండి. వాళ్లను మట్టిలో కలిపే సమయం వచ్చింది. ఉగ్రవాదులను కలలో కూడా ఊహించని రీతిలో శిక్షిస్తాం. అమాయకుల ప్రాణాలను తీసినదానికి వారు భారీ మూల్యం చెల్లించాల్సిందే’’ అంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ (Strong Warning) ఇచ్చారు.

జాతీయ భద్రతకు ప్రధాని హామీ
దేశ భద్రత విషయంలో రాజీపడమని, ఇలాంటి దాడులను తట్టుకోలేమని స్పష్టం చేసిన మోదీ, భద్రతా దళాలకు సంపూర్ణ మద్దతుగా నిలిచినట్లు చెప్పారు. ప్రజల ప్రాణాలకు విలువ తెలియని శత్రువులకు కనికరించబోమని ఆయన స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment