పహల్గామ్‌ ఉగ్రదాడి.. టెర్రరిస్ట్ ఫొటో వైరల్

పహల్గామ్‌ ఉగ్రదాడి.. టెర్రరిస్ట్ ఫొటో వైరల్

Summarize with AI

జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir)లోని అనంతనాగ్ (Anantnag) జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం పహల్గామ్‌ (Pahalgam)లో మంగళవారం ఉగ్రవాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ప‌ర్యాట‌క ప్రాంత‌మంతా భయానక దృశ్యాలతో నిండిపోయింది. ఈ ఘటనలో మొత్తం 30 మంది మృతిచెందారు. వీరిలో ఎక్కువ మంది దేశీయ పర్యాటకులే కాగా, ఇద్దరు విదేశీయులు, ఇద్దరు స్థానికులు కూడా చనిపోయారు.

ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్ట్ (Terrorist)లో ఒకరి ఫొటో (Photo) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారిక వర్గాల ప్రకారం.. బైసరన్ లోయ (Baisaran Valley)లో ట్రెక్కింగ్ కోసం వెళ్లిన పర్యాటక బృందాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో విశాఖపట్నం (Visakhapatnam)కు చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, హైదరాబాద్ (Hyderabad)లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో (Intelligence Bureau) పనిచేస్తున్న ఓ అధికారి కూడా మృతుల్లో ఉన్నారు. ఈ విషాద ఘటన పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

పాక్‌కు ప‌నేనా..?
ఈ దాడి వెనుక పాకిస్తాన్ (Pakistan)కు చెందిన ఉగ్రవాదులే ఉన్నట్టు స్థానిక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తి వివరాల కోసం ఉన్న‌తాధికారులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. టెర్రరిస్టుల వివరాలు సేకరించేందుకు పోలీసులు, భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment