పాదరక్షల ఘటనపై టీటీడీ చర్యలు.. సిబ్బంది స‌స్పెండ్‌

పాదరక్షల ఘటనపై టీటీడీ చర్యలు.. సిబ్బంది స‌స్పెండ్‌

Summarize with AI

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (Tirumala Tirupati Devasthanams – TTD) ఆల‌య ప్ర‌ధాన ద్వారం వ‌ర‌కు ఇద్ద‌రు వ్య‌క్తులు పాద‌ర‌క్ష‌లు వేసుకొని వ‌చ్చిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పించింది. ఆల‌య ప్ర‌ధాన ద్వారం వ‌ర‌కు పాద‌ర‌క్ష‌లు (Footwear) వేసుకొని రావ‌డ ఏంట‌ని, సిబ్బంది ఏం చేస్తున్నారంటూ తిరుమ‌లేశుని సేవ‌కులు మండిప‌డ్డారు. ఈ విషయంపై సోష‌ల్ మీడియా తీవ్ర వ్య‌తిరేక ఎదురైంది. దీంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స్పందించింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntham Queue Complex) ద్వారా ఇద్దరు వ్యక్తులు చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ (TTD) చర్యలు చేపట్టింది. తమ విధులను (Duties) సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసింది. టీటీడీ ఈవో(TTD-EO) శ్యామల రావు (Shyamala Rao) ఆదేశాల మేరకు ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది (TTD Staff), సెక్యూరిటీ గార్డులను (Security Guards) సస్పెండ్ (Suspended) చేశారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌ (SPF Director General) కు ప్రతిపాదన పంపారు.

సస్పెండ్ అయిన టీటీడీ సిబ్బంది

  1. చక్రపాణి (సీనియర్ అసిస్టెంట్)
  2. వాసు (జూనియర్ అసిస్టెంట్)

సస్పెండ్ అయిన టీటీడీ భద్రతా సిబ్బంది

  1. డి. బాలకృష్ణ
  2. వసుమతి
  3. టి. రాజేష్ కుమార్
  4. కె. వెంకటేష్
  5. ఎం. బాబు

సస్పెన్షన్‌కు ప్రతిపాదించబడిన ఎస్పీఎఫ్ సిబ్బంది – 6 మంది:

  1. సి. రమణయ్య (ఇన్‌ఛార్జ్)
  2. బి. నీలబాబు
  3. డి.ఎస్.కె. ప్రసన్న
  4. చ. సత్యనారాయణ
  5. పోలి నాయుడు
  6. ఎస్. శ్రీకాంత్

Join WhatsApp

Join Now

Leave a Comment