అగ్నిప్రమాదంలో గాయాలపాలైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) కి సింగపూర్ లోని ఆస్పత్రి (Hospital) లో చికిత్స కొనసాగుతోంది. కుమారుడికి గాయాలు కావడంతో నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ పవన్ కళ్యాణ్ తన అన్నావదిన చిరంజీవి (Chiranjeevi), సురేఖ (Surekha)తో కలిసి బయల్దేరిన పవన్.. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఆస్పత్రికి చేరుకున్నారు. స్కూల్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయాలపాలైన తన కుమారుడు మార్క్ ను చూశారు. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు.
కుమారుడిని చూసిన అనంతరం వైద్యులు, అధికారులతో పవన్ మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు (Tests) చేస్తున్నామని తెలియచేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.








