అన్నమయ్య (Annamayya) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో మనస్తాపానికి గురైన రైతు (Farmer) వెంకటాద్రి (Venkataadri) సూసైడ్ చేసుకున్న ఘటన టేకలకోన (Tekalakona) లో కలకలం రేపుతోంది. వెంకటాద్రి తన తండ్రి నుంచి సంక్రమించిన మిలిటరీ పట్టా భూమి (Military Patta Land) ని ఆన్లైన్లో నమోదు చేయాలంటూ పలుమార్లు రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. అయితే, అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన వెంకటాద్రి విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.
సూసైడ్ లెటర్లో సంచలన విషయాలు
ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ లెటర్లో తన మృతికు రెవెన్యూ అధికారులు (Revenue Officials), గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కారణమని పేర్కొన్నాడు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.








