వక్ఫ్ బిల్లు: దేశవ్యాప్తంగా ఉద్యమం చేప‌డ‌తాం – ముస్లిం పర్సనల్ లా బోర్డు

వక్ఫ్ బిల్లు: దేశవ్యాప్తంగా ఉద్యమానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) బుధవారం వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ బిల్లు ముస్లిం సమాజానికి మంచిది కాదని, మతపరమైన వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంటు (Parliament) లో బిల్లు ఆమోదం పొందితే, దేశవ్యాప్తంగా (Nationwide) పెద్ద ఎత్తున ఉద్యమం (Movement) చేపడతామని AIMPLB ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసి రసూల్ ఇలియాస్ (Dr. Syed Qasi Rasool Ilyas) హెచ్చరించారు.

“మేము మౌనం పాటించం. చట్టప్ర‌కారం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అనుసరిస్తాం. ప్రతిపాదిత సవరణలను వెనక్కి తీసుకునే వరకు శాంతియుత ఉద్యమం కొనసాగిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.

ముస్లింల‌ అభిప్రాయాలను విస్మరించిన పార్లమెంట్
AIMPLB సభ్యుడు మౌలానా ఖలీద్ రషీ ఫరంగి మహాలి (Maulana Khalid Rasheed Farangi Mahali) మాట్లాడుతూ, ముస్లిం సంస్థలు ఈ బిల్లుపై తమ అభ్యంతరాలను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి తెలియజేశాయని, కానీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. వక్ఫ్ ఆస్తులు మతపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని, ప్రార్థన, ఉపవాసం, తీర్థయాత్రలకు సమానంగా చూడాలని సూచించారు. ముస్లిం సమాజం మనోభావాలను గౌరవించి, ఈ సవరణలను పార్లమెంటు తిరస్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యాయ నిపుణుల భిన్న అభిప్రాయం
కొందరు న్యాయనిపుణులు మాత్రం బిల్లులోని కొన్ని నిబంధనలను సమర్థించారు. వారణాసికి చెందిన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ (Vishnu Shankar Jain) మాట్లాడుతూ “ఈ బిల్లు వక్ఫ్ బోర్డులకు ఉన్న అపరిమిత అధికారాలను తగ్గించి, నియంత్రణను పెంచేందుకు దోహదపడుతుంది. అయితే, ఇంకా కొన్ని అంశాలపై చర్చ అవసరం” అని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment