పాఠశాలలో రచ్చ.. టీచర్ vs అంగన్‌వాడీ వర్కర్

జుట్టుప‌ట్టుకొని కొట్టుకున్న టీచర్ vs అంగన్‌వాడీ వర్కర్

ఓ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ (Assistant Teacher), అంగన్వాడీ వర్కర్ (Anganwadi Worker) మధ్య ఘోరమైన ఘర్షణ చోటుచేసుకుంది. స్కూల్ ప్రాంగణంలో మాటామాటా పెరిగి, చివరికి వారు పరస్పరం జుట్టు పట్టుకుని కిందపడి కొట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లోని మథుర (Mathura) లో చోటు చేసుకుంది. అసిస్టెంట్ టీచర్ ప్రీతి తివారీ (Preeti Tiwari), అంగన్‌శాడీ కార్యకర్త చంద్రావతి (Chandravati) మధ్య ఒక విష‌యంలో వాగ్వాదం ప్రారంభమైంది. అది కాస్త క్రమంగా తీవ్రంగా మారింది. కొద్దిసేపటికే ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా తోసుకుంటూ, బలంగా కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఇది అక్కడి విద్యార్థులు, సిబ్బందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

సంఘటనపై స్కూల్ సిబ్బంది (School Staff) వెంటనే స్పందించి వారిని విడదీశారు. అయితే ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment