భారీ భూకంపంతో బ్యాంకాక్ (Bangkok) నగరం భయంతో వణికిపోయింది. భూమి తీవ్రంగా కంపించడంతో నగరంలోని భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. బ్యాంకాక్‌లో నివాసం ఉంటున్న భారతీయ (Indian) ప్రవాసి ప్రేమ్ కిషోర్ మోహంతి (Prem Kishore Mohanty) తన ఐదేళ్ల కుమార్తె స్కూల్ స్పోర్ట్స్ డే (School Sports Day) కార్యక్రమానికి హాజరయ్యారు. పిల్లలు పోటీపడుతూ, తల్లిదండ్రులు ఉత్సాహంగా గడిపే సమయంలో, ఒక్కసారిగా భూమి కంపించడంతో పరిస్థితి భయానకంగా మారిపోయిందని ఆయన వెల్లడించారు.
“నా తల తిరుగుతున్నట్లు అనిపించింది. కూర్చోవాల్సి వచ్చింది. భవనం పైకప్పు లైట్లు ఊగిపోతున్నాయి, కుర్చీలు కదులుతున్నాయి” అని 44 ఏళ్ల మోహాంతి తెలిపారు. స్కూల్ పీఏ సిస్టమ్ హుటాహుటిన అత్యవసర ఖాళీ ప్రకటన చేస్తూ, అందరినీ బహిరంగ మైదానానికి తరలించింది. సమీపంలోని ఎత్తైన భవనాల మధ్య వీధుల్లోకి వెళ్లొద్దని హెచ్చరించిందని ఆయన వివరించారు. “అది అతి భయంకరమైన అనుభవం. మమ్మల్ని తక్షణమే అగ్నిమాపక మార్గం ద్వారా బయటికి వెళ్లమని చెప్పారు. ఆ సమయంలో ఏం చేయాలనే ఆలోచించడానికి కూడా సమయం లేకుండా పోయింది” అని మోహాంతి గుర్తుచేసుకున్నారు.
భయంతో కదలిపోయిన బ్యాంకాక్
మయన్మార్ (Myanmar) లో కేంద్రబిందువుగా 7.7-రిక్టర్ స్కేల్ తీవ్రతతో వచ్చిన భూకంపం (Earthquake) థాయ్‌లాండ్ (Thailand) ను కుదిపేసింది. బ్యాంకాక్‌లో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నిలిచిపోయింది, ట్రాఫిక్ స్థంభించిపోయింది, భవనాలను ఖాళీ చేసి ప్రజలు బయట పడిపోయారు. ఇంటర్కాంటినెంటల్ బ్యాంకాక్ వంటి హోటళ్ల పైకప్పు స్విమ్మింగ్‌పూల్‌ల నుండి నీరు భవనాల మీదుగా జారిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బ్యాంకాక్‌లో భూకంపాలు చాలా అరుదు. ఎక్కువగా ఎండలు, వర్షాలతో అలవాటుపడిన ఈ నగరానికి భూకంపం అంటే తెలియదు. సుఖుమ్విత్ ప్రాంతంలోని హైరైజ్ అపార్ట్మెంట్లో నివసించే మోహంతి కుటుంబానికి ఈ ఘటన తీరని భయాన్ని మిగిల్చింది. ఇప్పుడు వారు సురక్షితంగా ఉన్నప్పటికీ, ఆ అనుభవం నుంచి తేరుకోలేకపోతున్నారు. నగరమంతా ఒక్కసారిగా భయంతో కదలిపోయిన ఆ క్షణాలు ఆయన కుటుంబంతోపాటు వేలాదిమందికి మరచిపోలేని అనుభూతిగా మిగిలాయి.








ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు