తెలంగాణ (Telangana) లో టమాటా ధరలు పతనమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలో టమాటా (Tomato) ధర రూ.3 మాత్రమే ఉండటంతో చేసేదేమీ లేక రైతులు (Farmers) తమ పంటను రోడ్లపై పారేస్తున్నారు. కనీస రవాణా ఖర్చులైనా వచ్చే పరిస్థితి లేక రైతులు కన్నీళ్లతో నిలబడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా రైతుకు ఎదురైన షాక్
రంగారెడ్డి జిల్లా (Rangareddy district) కొందుర్తి (Kondurthi) కి చెందిన ఓ రైతు మహబూబ్నగర్ (Mahbubnagar) రైతుబజారుకు 30 కేజీల 56 టమాటా పెట్టెలను తీసుకెళ్లాడు. అయితే దళారులు కేవలం 39 పెట్టెలకు రూ.3900 మాత్రమే ఇచ్చారు, మిగతావి కొనకపోవడంతో రైతు రోడ్డు పక్కన వాటిని పారవేశాడు. కనీసం రవాణా ఖర్చులు (Transport Costs) కూడా రాలేదని బాధతో రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
బహిరంగ మార్కెట్లో రూ.20-30.. కానీ,
ఒకవైపు బహిరంగ మార్కెట్లో (Retail Market) టమాటా ధర రూ.20 నుంచి రూ.30 వరకు ఉంది, కానీ రైతులకు మాత్రం ఆ ప్రయోజనం ఏమాత్రం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh) నుంచి అధికంగా టమాటా దిగుమతి అవుతుండటమే తెలంగాణ (Telangana) రైతుల పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తోంది. తెలంగాణ మార్కెట్లో కొనుగోలుదారులు లేకపోవడం, మధ్యవర్తులు ఎక్కువగా లాభపడటం వల్ల రైతుల కష్టానికి పరిష్కారం కనిపించడంలేదు. తక్కువ ధరల కారణంగా టమాటా రైతులు ప్రభుత్వ సహాయం (Assistance) కోసం ఎదురుచూస్తున్నారు.