ఆంధ్రప్రదేశ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏపీ నాటక అకాడమీ ప్రత్యేకంగా ‘చంద్రన్న నాటకోత్సవాలు’ నిర్వహించనుంది. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నాటకోత్సవాల్లో నాటికలు, పౌరాణిక, సామాజిక నాటకాలు, పద్య నాటకాలు ప్రదర్శించనున్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఉత్తమ నాటక సమితులు ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం పొందనున్నాయి. ఆసక్తి గల కళాకారులు తమ వివరాలు, సాధించిన విజయాలు, ప్రదర్శించబోయే నాటక వివరాలను ఏపీ నాటక అకాడమీ చిరునామాకు పంపాలని సూచించారు.
News Wire
-
01
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
హీట్ వేవ్ అలెర్ట్స్ జారీ. 5 రోజులపాటు ఏపీ వ్యాప్తంగా వడగాల్పులు. కోస్తా జిల్లాలకు రెడ్ అలెర్ట్.
-
02
త్వరలో తమిళనాడు కేబినెట్ విస్తరణ
కేబినెట్ లో చేరనున్న కాంగ్రెస్, IUML, VCK. AIADMK రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులంటూ ప్రచారం
-
03
అనంతపురం లో యువకుడికి దేహశుద్ధి
విడపనకల్లో యువకుడికి గుండుకొట్టి ఊరేగించిన గ్రామస్తులు. ప్రేమ పేరుతో వివాహితను వేధించిన యువకుడు
-
04
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
కంపార్ట్మెంట్లు నిండి క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్నహుండీ ఆదాయం రూ.3.74 కోట్లు
-
05
ఇటలీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
5 దేశాల పర్యటనలో భాగంగా రోమ్ కు చేరుకున్న మోదీ. ఇటలీ ప్రధాని మెలోనితో మోదీ భేటీ.
-
06
లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
లక్నోపై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలుపు. స్కోర్లు: లక్నో 220/5, రాజస్థాన్ 225/3
-
07
విశాఖలో 2 నెలలు చేపలు వేట నిషేదం
వేట నిషేదం తో ఒడ్డుకే పరిమితం కానున్న 600కుపైగా మరబోట్లు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో నిలిచిపోనున్న విక్రయాలు.
-
08
చందనోత్సవ టికెట్ల జారీలో తీవ్ర గందరగోళం
సింహాచలం లో అరకొరగా టికెట్లు విక్రయిస్తున్న దేవస్థానం అధికారులు. గంటల తరబడి క్యూలైన్ లో ఉన్నా భక్తులకు తప్పని నిరాశ.
-
09
సెల్ టవర్ ఎక్కిన యువకుడు
టీడీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలతో మంగళగిరి పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. సెల్ టవర్ నుంచి దూకేస్తానంటూ యువకుడి హెచ్చరిక.
-
10
తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీ..
రాజధాని అమరావతి వద్దు.. 3 జిల్లాల మావిగన్ తోనే అభివృద్ధి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు








