నటుడు, రచయిత, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో శనివారం సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. విడుదల సందర్భంగా గుంటూరు జైలు వద్దకు వైసీపీ లీగల్ టీమ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు వెళ్లి పోసానిని పరామర్శించారు. దీంతో పోసాని భావోద్వేగానికి గురయ్యారు.
News Wire
-
01
రైలు ఢీకొని ముగ్గురు ఏపీ వాసులు మృతి
కర్ణాటకలో దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్ వద్ద ట్రాక్ దాటుతుండగా ప్రమాదం. హిందూపురానికి చెందిన ఇర్ఫాన్ (46), రుకయ్యా (13), రాకియా (8) మృతి.
-
02
ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ఏపీజేఏసీ అమరావతి నిరసన. మా డబ్బులు మాకివ్వండి నినాదంతో ఉద్యోగుల ర్యాలీలు
-
03
ఏనుగుల బీభత్సం
మన్యం జిల్లా భామినిలో ఏనుగుల మంద బీభత్సం. మొక్కజొన్న, చెరుకు పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు
-
04
జైల్లో రిమాండ్ ఖైదీ మృతి
నెల్లూరు సెంట్రల్ జైలు బ్యారక్‌లో కుప్పకూలిన ఖైదీ మౌలాలి (48). జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మరణించాడన్న వైద్యులు
-
05
విజయ డెయిరీ సంచలన నిర్ణయం
పాల సేకరణ ధరను లీటర్ కు రూ.3 పెంచిన విజయ డెయిరీ. వచ్చే నెల 1 నుంచి పాడి రైతులకు లీటర్ రూ.88 చెల్లింపు. ఎండీ ప్రకటన.
-
06
వర్షాలు కురవాలని తిరుమలలో యాగాలు
ఆగస్టు 30 నుంచి కారీరిష్టి యాగం. సెప్టెంబర్ 3 వరకు వరుణయాగం. సమృద్ధి వర్షాల కోసం పర్జన్యశాంతి హోమం. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో యాగాలు
-
07
టీడీపీ కార్యాలయం ముట్టడి
కర్నూలు టీడీపీ ఆఫీసును ముట్టడించిన బుడజ జంగం నేతలు. బుడగ జంగాలకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్
-
08
ఏపీలో ఖరీదవుతున్న వైద్య విద్య
ఏపీలో వైద్య విద్య ఫీజులు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు. 10 శాతం ఫీజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
-
09
అరకులో చంద్రబాబు సభ
అరకు లోయ నియోజకవర్గం గన్నెలిలో సంజీవని కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
-
10
700 దాటిన మృతుల సంఖ్య
నేపాల్ వరదల్లో 700 దాటిన మృతుల సంఖ్య, 5,851 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. 2,426 మంది గల్లంతు అయినట్టు వెల్లడి








