నాగ్‌పూర్ అల్లర్లు.. కీలక సూత్రధారి అరెస్ట్

నాగ్‌పూర్ అల్లర్లు.. కీలక సూత్రధారి అరెస్ట్

నాగ్‌పూర్‌లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో తీవ్ర మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఒక వర్గం ఇళ్లను, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని కొందరు ముస్లింలు దాడులకు పాల్పడ్డారు. ఈ హింసకు ప్రధాన సూత్రధారిగా గుర్తించిన ఫహీమ్ ఖాన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఈ స్థానిక రాజకీయ నాయకుడిని శుక్రవారం వరకు పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు.

ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి 60 మందిని అరెస్ట్ చేయగా, మొత్తం 1200 మందిపై ఫిర్యాదులు నమోదయ్యాయి. వీరిలో 200 మందికి పైగా గుర్తింపు దశలో ఉండగా, మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అల్లర్లకు నాంది ఎలా పడింది?
ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్)లో ఉన్న ఔరంగజేబు మసీదును తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా పవిత్ర వస్త్రాన్ని తగలబెట్టారని వచ్చిన పుకార్లు మత ఉద్రిక్తతను రెచ్చగొట్టాయి. నమాజ్ ముగిసిన వెంటనే దాదాపు 250 మంది తీవ్ర నినాదాలు చేస్తూ అల్లర్లు చేశారు. ప్రజల వాహనాలకు నిప్పంటించి, పోలీసులపై రాళ్లతో దాడి చేశారు.

ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధం
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఈ హింసను ‘‘ముందస్తు కుట్ర’’గా అభివర్ణించారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ప్రణాళికాబద్ధంగా దాడులు జరిగినట్టు తెలిపారు. ‘‘ఛావా’’ సినిమా విడుదల తర్వాత శంభాజీ మహరాజ్, మొఘల్ పాలకుల చుట్టూ భావోద్వేగాలు మరింత ముదిరాయి. దీంతోనే ఔరంగజేబు మసీదును తొలగించాలని డిమాండ్లు పెరిగాయి. ఈ పరిణామాలతో నాగ్‌పూర్ ఇంకా ఉద్రిక్తత పరిస్థితుల్లోనే ఉండగా, పోలీసుల తీరుపై తీవ్ర చర్చ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment