సహాయ చర్యలకు అడ్డుగా మారిన నీటి ప్ర‌వాహం

సహాయ చర్యలకు అడ్డుగా మారిన నీటి ప్ర‌వాహం

Summarize with AI

ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగిలిపోయిన ఏడు మంది మృతదేహాల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు సోమవారం నాటికి 24వ రోజుకు చేరుకున్నాయి. సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, రాట్ హోల్ మైనర్స్ సహా అనేక బృందాలు రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నాయి. అయితే ఈ ఆపరేషన్‌ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్ సహా ఉన్నతాధికారులు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

కాలువలా పారుతున్న నీరు..
సొరంగంలో నీటి ప్రవాహం ఏమాత్రం తగ్గకపోవడంతో సహాయక చర్యలకు భారీ అవరోధంగా మారింది. 13.5 కిలోమీటర్ల తర్వాత ఏర్పాటైన డి2 ప్రాంతంలో నీటి ప్రవాహం మరింత పెరుగుతుండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. నీటిని బయటకు పంపేందుకు అధికారులు ప్రతి రెండున్నర కిలోమీటర్లకు పంప్ మోటార్లు ఏర్పాటు చేసినప్పటికీ, వరద ప్రవాహం అదుపులోకి రాలేదు.

రోబో సేవలకు సాంకేతిక సమస్యలు
గత కొన్ని రోజులుగా సహాయక చర్యల్లో రోబో సేవలను వినియోగించాలని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, సాంకేతిక సమస్యల వల్ల అవి పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. అయితే సోమవారం నుంచి రోబో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం. టిబిటి మిషన్ శకలాలను దక్షిణ మధ్య రైల్వే రెస్క్యూ టీం కట్ చేస్తూ బయటకు పంపుతోంది. ప్రమాదకరంగా మారిన డి1 ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఏడు మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment