ఉట్టి కోసం ప్రాణాలకు తెగించి ప్రపంచ రికార్డు (Video)

ఉట్టి కోసం ప్రాణాలకు తెగించి ప్రపంచ రికార్డు (Video)

Summarize with AI

కృష్ణాష్టమి (Krishnashtami) సందర్భంగా ముంబై (Mumbai) నగరం శ్రీ‌కృష్ణ నామ‌స్మ‌ర‌ణ‌తో ఉత్సాహంతో మార్మోగింది. జోగేశ్వరి (Jogeshwari)లో జరిగిన ఉట్టి కొట్టే వేడుకలో కొంకణ్ నగర్ గోవింద బృందం కొత్త చరిత్ర సృష్టించింది. యువకులు ఒకరిపై ఒకరు ఎక్కుతూ 10 అంతస్తుల పిరమిడ్ నిర్మించి ఉట్టిని అందుకోవడం విశేషం. ఈ ఘనకార్యం ద్వారా వారు ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

యువ‌కులు పిర‌మిడ్‌గా ఏర్ప‌డే క్ర‌మంలో వారిలోని క్రమశిక్షణ, సమన్వయం, జట్టు స్పూర్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. మానవ పిరమిడ్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు తమ ప్రాణాలను పణంగా పెట్టి చేసిన సాహసం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. గంటల తరబడి శ్రమించి విజయాన్ని సాధించిన గోవింద బృందం (Govinda Team) కృషి అందరికీ ప్రేరణగా నిలిచింది.

ఈ అరుదైన రికార్డుపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర (Maharashtra) మంత్రి ప్రతాప్ సార్నాయక్ (Pratap Sarnayak) స్వయంగా అక్కడికి చేరుకుని గోవింద బృంద సభ్యులను అభినందించారు. “ఇలాంటి ధైర్యసాహసాలు మహారాష్ట్ర సంస్కృతికి ప్రతీక” అంటూ ఆయన కొనియాడారు. ఈ విజయంతో ఉట్టి వేడుకకు మరింత గౌరవం చేకూరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment