---Advertisement---

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు
---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లోని కొన‌సాగుతున్న ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ అధికార టీడీపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించింది. వైసీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎర్ర చంద‌నం స్మగ్లింగ్‌లో టీడీపీ నాయకుల ప్రమేయం ఉంద‌ని వివరించారు.

పుత్తా శివ‌శంక‌ర్ వ్యాఖ్య‌ల ప్ర‌కారం.. గ‌త టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ విస్తృతంగా జరిగింది. ఈ వ్యవహారంలో చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ వ్యాన్‌లలో ఎర్రచందనం దుంగలను తరలించారని ఆయన ఆరోపించారు.

నాడు టీడీపీ నేతల అక్రమార్జనలున్నాయా?
టీడీపీ నేతలు ఎర్రచందనం స్మగ్లర్లుగా అవ‌తారం ఎత్తి అక్రమంగా కోట్లు సంపాదించినట్లు పుత్తా శివ‌శంక‌ర్‌రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లా చాగల్లు మండల పరిషత్‌ అధ్యక్షుడు మస్తాన్‌వలీ వంటి వ్యక్తులు ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన కోట్ల రూపాయ‌ల‌తో సినిమా నిర్మాతగా అవ‌తారం ఎత్తార‌న్నారు. తన సినిమాలో నటించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్నాడని, చివరికి ఆమె కూడా అదే ఎర్రచందనం స్మగ్లింగ్‌లో భాగస్వామిగా మారి పట్టుబడిందని గుర్తుచేశారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు
వైసీపీ ప్రభుత్వ హ‌యాంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నియంత్రించేందుకు అప్ప‌టి మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కఠిన చర్యలు చేప‌ట్టార‌ని పుత్తా శివశంకర్ తెలిపారు. పీడి యాక్ట్ ద్వారా ఎర్ర‌చంద‌నం స్మగ్లర్లపై వైఎస్ జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, మొదటిసారి శేషాచలం అటవీ ప్రాంతంలో 24 ఫారెస్ట్‌ రేంజ్‌లను గుర్తించి 24 మంది డీఎఫ్‌ఓలను నియమించడంతో పాటు, వారికి వన్‌ ప్లస్‌ ఫోర్‌ ఆర్మ్‌డ్‌ సిబ్బందిని కేటాయించారని గుర్తుచేశారు. అప్పటి వరకు పనికిరాని వాహనాలతో స్మగ్లర్లతో పోటీ పడలేక ఉసూరుమంటున్న అటవీ శాఖకు ఏకంగా 370 అత్యాధునిక వాహనాలను అందించారన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment