ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మహిళలకు (Women) ఉచిత బస్సు (Free Bus) ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం(CM) చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వంపై ఏపీ(AP) కాంగ్రెస్ (Congress) రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. “14 నెలల ఆలస్యంగా ప్రారంభించిన ఈ పథకం అసలు మహిళలకు ఉపయోగం కాని మోసపూరిత ప్రయత్నం” అని ఆమె వ్యాఖ్యానించారు. సీఎం చేసిన ప్రకటనలు సిగ్గుచేటు అని ఆమె ఎద్దేవా చేశారు.
“సూపర్ సిక్స్ (Super Six) కాదు… సూపర్ ఫ్లాప్(Super Flop)” అంటూ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. నిరుద్యోగుల భృతి, ఆడబిడ్డ నిధి, రైతుల పథకాలు అన్నీ వాయిదాల పర్వమయ్యాయని ఆరోపించారు. “20 లక్షల ఉద్యోగాల్లో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?” అంటూ చంద్రబాబును నిలదీశారు. సంక్షేమ పథకాలలో తగ్గింపులు చేసి, ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా, 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకు అయినా నెలకు రూ.1,500 ఇచ్చారా? అన్నదాత సుఖీభవలో రూ.20 వేలు ఇస్తామని చెప్పి.. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో లింక్ పెట్టారని, తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారు. రూ.15 వేలు ఇస్తామని రూ.13 వేలకు సరిపెట్టారు. మూడు సిలిండర్లు ఎంత మందికి అందుతున్నాయో అర్థంకాని పరిస్థితి… అని ప్రశ్నల వర్షం కురిపించారు. “చంద్రబాబు చేసినది ఘరానా మోసం మాత్రమే. సంక్షేమం తగ్గింది, అభివృద్ధి ఆగిపోయింది, పాలన అర్థం తప్పిపోయింది” అని షర్మిల మండిపడ్డారు.
#సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్
— YS Sharmila (@realyssharmila) August 16, 2025
సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యింది సీఎం చంద్రబాబు గారు @ncbn ? 20 లక్షల ఉద్యోగాల్లో ఒక్కరికైనా ఇచ్చారా? నెలకు రూ.3వేల భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా ? 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకైనా నెలకు రూ.15 వందలు అకౌంట్ లో పడ్డాయా ? అన్నదాత సుఖీభవ కింద…