ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (CM) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) 75వ పుట్టినరోజు (75th Birthday) సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు (Birthday Wishes) తెలియజేస్తున్నారు.
మోడీ ట్వీట్
చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “నారా చంద్రబాబు నాయుడు నా స్నేహితుడు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయం” అని మోదీ ట్వీట్ చేశారు.
Best wishes to my good friend and Andhra Pradesh CM Shri N. Chandrababu Naidu Garu. It is commendable how he is tirelessly working for the development of AP, with a focus on futuristic sectors. Praying for his long and healthy life.@ncbn
— Narendra Modi (@narendramodi) April 20, 2025
జగన్ శుభాకాంక్షలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ద్వారా చంద్రబాబుకు శుభాకాంక్షలు (Wishes) తెలిపారు. “హ్యాపీ బర్త్ డే నారా చంద్రబాబు నాయుడు గారూ! మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను” అని జగన్ ట్వీట్ చేశారు.
Happy Birthday to @Ncbn Garu! Wishing you a peaceful and healthy long life!
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2025
డిప్యూటీ సీఎం పవన్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు (Wishes) తెలియజేశారు. అనితర సాధ్యుడు చంద్రబాబుకు వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రగతిని పునరుజ్జీవింప చేయగల దార్శనికుడు ఆయన. ఆయన విజన్, కృషి, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకం” అని పవన్ కల్యాణ్ కొనియాడారు.
*అనితర సాధ్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు*
— Pawan Kalyan (@PawanKalyan) April 20, 2025
* వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు
ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి…








